Site icon HashtagU Telugu

Lamp: మీరు చేసే పనులు విజయవంతం అవ్వాలంటే.. దీపాన్ని ఇలా పెట్టాల్సిందే?

Mixcollage 02 Dec 2023 07 03 Pm 7627

Mixcollage 02 Dec 2023 07 03 Pm 7627

మామూలుగా చాలామంది ఎటువంటి పనులు చేసినా కూడా సరిగా జరగడం లేదని పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. అటువంటి వాటికి వాస్తు పరమైన దోషాలు, అలాగే కొన్ని గ్రహ దోషాలు కూడా కారణం కావచ్చు. అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాటున కూడా మనం ఎదుర్కొనే సమస్యలకు కారణం అవుతాయి. అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.

మరి మన ఆర్థిక పరిస్థితి మెరుగు అవ్వాలంటే ఏం చేయాలి అందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే అనుకున్న పని విజయవంతం అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావిచెట్టు దీన్నే అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికతకు అనేక రహస్యాలు దాగిఉన్నాయి. రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది. పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అదేవిధంగా శాపాలు, దోషాలను గ్రహపీడలను నివారించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష్కకర్మ ఫలితాలు ఉండవు.

పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి, విష్ణునామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపం పెడితే చాలు కొన్ని వారాలలో మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.