Site icon HashtagU Telugu

Deeparadhana: ఇంట్లో దీపాన్ని ఏ దిశలో ఉంచాలి.. నేతి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

Mixcollage 01 Jan 2024 03 12 Pm 7729

Mixcollage 01 Jan 2024 03 12 Pm 7729

మామూలుగా దీపారాధన విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహించాలి అనేక రకాల నియమాలు పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు. లేదంటే పూజ చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతూ ఉంటారు. అయితే మామూలుగా ఇంట్లో చేసే నిత్య పూజకు ఎప్పుడు కూడా మట్టి ప్రమిదలు వాడకూడదు. పంచలోహాలతో చేసిన దీపాలు, వెండి లేదా ఇత్తడి దీపాలు వాడాలి. తెల్లవారు జామున 3 నుంచి 6 లోపు దీపారాధన చెయ్యడం శుభకరం. సూర్యా స్తమయం తర్వాత లక్ష్మీ ఆరాధన చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పు ముఖంగా వెలిగించే దీపం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి.

పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరి సంపదలు, విద్య, వివాహ ప్రాప్తికి దోహదం చేస్తుంది. దక్షిణ దిశగా దీపారాధన చెయ్యకూడదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దు:ఖం, బాధ కలుగుతాయి. అలాగే ఎప్పుడు కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చెయ్యకూడదు. నువ్వుల నూనె వాడితే మంచిది. ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్యం సజావుగా ఉంటుంది. వేప, కొబ్బరి నూనెలు కలిపి 41 రోజులు దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేతి దీపం అత్యంత మంగళకరం. నేతి దీపం ప్రతి రోజూ సంధ్యా సమయంలో తులసి ముందు, ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తారు.

నేతి దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. నేతి దీపాన్ని రోజూ దీపారాధనకు ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది దేవతలకు ఇష్టమైన దీపారాధన. ఇంటి వాతావరణంలో ఉన్న నెగెటివిటి తొలగిపోతుంది. సాయంత్రం వేళ నేతి దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. నేతి దీపంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. నెయ్యి, నూనె రెండింటితో దీపారాధన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మల్లె నూనెతో హనుమంతునికి వెలిగిస్తే శని దేవుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం.
నెయ్యిదీపం ఎప్పుడూ ఎడమ వైపు ఉంచాలి. నూనె దీపం కుడివైపు ఉంచాలి. లక్ష్మీ కటాక్షానికి నేతి దీపం శ్రేష్టం. వాస్తు ప్రకారం ఇంట్లో వెలిగించే దీపానికి దిశలు కచ్చితంగా పాటించాలి. దీపాన్ని తప్పు దిశలో ఉంచడం వల్ల అనర్థాలు జరగవచ్చు. దీపాన్ని ఎప్పుడు ఇంటికి పశ్చిమాభిముఖంగా వెలిగించాలి. ఇది ఇంట్లోకి సానుకూలతను ఆహ్వానిస్తుంది దీపాన్నెపుడు కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించాలి.

Exit mobile version