Lakshmi Devi: ప్రతీరోజు సాయంత్రం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. డబ్బే డబ్బు?

  • Written By:
  • Updated On - March 16, 2024 / 02:51 PM IST

హిందువులు లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధిదేవత అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు తనపై, తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరకుంటూ ఉంటారు. అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం వేళ చేసే కొన్ని పనులు ఫలవంతంగా పరిగణించబడుతున్నాయి. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకున్న వారు సాయంత్రం సమయంలో ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే చాలా లక్ష్మి అనుగ్రహం ఈజీగా కలుగుతుంది.

మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువు నివసిస్తారని నమ్మకం. అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది. పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుందని ఆమె అనుగ్రహం వల్ల ఇంట్లో డబ్బు, ధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదని కూడా నమ్ముతారు. కనుక ప్రతిరోజు సాయంత్రం తులసి పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి.

అలాగే హిందూ మతంలో చేసే పూజలో కర్పూరం ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా అన్ని రకాల పూజలలో ఉపయోగించబడుతుంది. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరుతుందని నమ్ముతారు. ఇది ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తుంది. అందుకే సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఇల్లు అంతా చూపించాలి. వెలుగుతున్న కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది. లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అందువల్ల ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు. ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని విశ్వాసం. కనుక ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం ఈజీగా కలుగుతుంది.