Site icon HashtagU Telugu

Friday: లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలంటే.. శుక్రవారం రాత్రి ఇలా చేయాల్సిందే!

Friday

Friday

మామూలుగా వారంలో శుక్రవారం రోజు లక్ష్మి దేవికి అంకితం చేయబడింది. ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఈరోజున ప్రత్యేకమైన నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం లో కొన్ని రకాల పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు చాలా మందే ఉన్నారు. సమయానికి డబ్బులు అందక ఇబ్బంది పడిపోతుంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అష్టలక్ష్మి ఆరాధన చేయాలని కొందరు పండితులు చెబుతున్నారు.

అష్టలక్ష్మీ ఆరాధన మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు 108 సార్లు జపించాలట. ఈ మంత్రం మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తుందని, చేస్తున్న పనిలో లాభాలను పొందవచ్చని, మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ లక్ష్మీ దేవీ మంత్రం మీకు ఆమె అనుగ్రహం పొందేలా చేస్తుందట. ఇందుకోసం మీరు శుక్రవారం రాత్రి పూజ చేసేటప్పుడు “ఐం హీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్దయే” అనే మంత్రాన్ని జపించాలట. ఎర్రని వస్త్రం పై పరిచి దానిపై లక్ష్మీదేవి యంత్ర చిత్ర పటాన్ని పెట్టి నిష్టగా పూజ చేయాలని చెబుతున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల వ్యాపారం సాఫీగా సాగుతుందట. అలాగే మంచి లాభాలను పొందుతారు.

అయితే పూజా సమయంలో ఈ యంత్రానికి అష్ట గంధాన్ని పెట్టాలని, అలాగే అమ్మవారు లక్ష్మీదేవికి తిలకం పెట్టడం మర్చిపోకూడదని చెబుతున్నారు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయట. మీ ఇళ్లు సంతోషంగా ఉంటుందట. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారట. అయితే ఈ రోజు మహా విష్ణువుకు జలాభిషేకం చేస్తే కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. ఇలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలనేవే రావని చెబుతున్నారు.