Spiritual: లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద వస్తుందన్న విషయం తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. పూజలు చేస్తున్నాము కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందని మనకు ఎలా తెలుస్తుంది? ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా అంటే అవును అని అంటున్నారు పండితులు. లక్ష్మీదేవి సంతోషించినప్పుడు, మీ ఇల్లు సంపద, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. కాబట్టి ఆమె ఆశీర్వాదాలు పొందడానికి, ఆమెను సంతోషపెట్టడానికి ఎప్పటికప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉండాలట.
లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో అక్కడ ఎప్పుడూ సంపద, శ్రేయస్సుకు కొరత ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టడానికి ముందే, మన సంపద పెరుగుతుందని తెలియజేస్తూ కొన్ని సంకేతాలు పంపుతుందట. ఆ సంకేతాల ద్వారా ఆ తల్లి కటాక్షం మనపై ఉందని అర్ధం అంటున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు ఇంటి నుంచి బయటకు బయలుదేరినప్పుడు నీరు లేదా పాలతో కూడిన పాత్రను చూస్తే అది సంపద, కీర్తిని పొందడానికి సంకేతం అని చెబుతున్నారు. అయితే ఖాళీ కుండ లేదా పాత్రలను చూడటం అశుభం అని పరిగణిస్తారట. అదేవిధంగా మనం ఉదయం నిద్రలేవగానే శంఖం శబ్దం వినపడటం శుభప్రదంగా, అదృష్టానికి సంకేతంగా పరిగణించాలట.
శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వస్తువు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అనడానికి ఇది సంకేతంగా భావించాలట. అలాగే మీ ఇంటి ముందు ఆవు పేడను పదే పదే వేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారట. ఇలా మీరు ఆవుపేడను చూడటం కూడా అదృష్టంగా భావిస్తారు. ఇలా మీకు కనపడింది అంటే మీ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని అర్థం. మీరు మీ ఇంట్లో సానుకూల భావన కలిగి ఉంటే, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. కొంత ఆహారంతో సంతృప్తి చెందితే, ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలకు స్పష్టమైన సంకేతంగా భావించాలట. ఇది లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని అర్ధం అంటున్నారు. మీరు లక్ష్మీదేవి లేదా ఆమె వాహనం అయిన గుడ్లగూబను కలలో చూసినట్లయితే, అది శుభ సంకేతంగా పరిగణిస్తారట. వాస్తవానికి, గుడ్లగూబను చూడటం రాత్రికి రాత్రే అదృష్టంలో మార్పుకు సంకేతంగా భావించాలట. పైన చెప్పిన సంకేతాలు కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వడం ఖాయం.
Spiritual: మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

Lakshmi Devi