Financial Problems: ఆర్థిక సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే లక్ష్మి దేవిని పూజించేటప్పుడు ఇలా చేయాల్సిందే!

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని విధివిధానాలను పాటిస్తే డబ్బుకి సంబంధించిన సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు.

Published By: HashtagU Telugu Desk
Lakshmi Devi

Lakshmi Devi

వారంలో శుక్రవారం రోజు లక్ష్మి దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నాను. లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు కలగడంతో పాటు ఆర్థికపరమైన సమస్యలు, అందులో దూరమవుతాయని చెబుతున్నారు. లక్ష్మీదేవిలో అష్ట లక్ష్ములు ఉంటారు. ఈ రూపాలన్నీ అమ్మవారిలో ఉండే శక్తులే అమ్మవారి కరుణ ఉంటే జీవితంలో అన్నీ లభిస్తాయట. అయితే లక్ష్మీదేవిని ఆర్థిక సమస్యల కోసం ఎక్కువగా పూజిస్తూ ఉంటారు.

ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించే విధానం మీద ఆర్థిక సమస్యల పరిష్కారాలు ఆధారపడి ఉంటాయట. శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని తగిన ఆచారాలతో పూజిస్తే, ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరడమే కాకుండా, జాతకంలో శుక్రుడి స్థానం కూడా బలపడుతుందని, శుక్రుని స్థానం బలంగా ఉన్నప్పుడే వ్యక్తి భౌతిక సుఖాలు పెరుగుతాయట. అలాగే వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా ప్రజలు అందరూ ఇష్టపడేలా కూడా మారుతుందని,అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ ఉంటారని చెబుతున్నారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజలో లక్ష్మీ చాలీసా పఠించాలని చెబుతున్నారు పండితులు.

అలాగే లక్ష్మీదేవి సహస్ర నామాలు కూడా ఉంటాయట. లక్ష్మీదేవికి పూజలు చేయడం మాత్రమే కాదు అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడ అయితే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. శుభ్రత ఉన్న గడపలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతున్నారు. తులసిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెబుతున్నారు. అందుకే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేయాలని చెబుతున్నారు. అలాగే తులసి కోట చుట్టూ శుభ్రం చేసి ముగ్గు వేయాలట. పూజలో లక్ష్మీ చాలీసా లేదా లక్ష్మీ సహస్రనామాలు పఠించాలట. లక్ష్మీదేవి ముందు పచ్చ కర్పూరం ఉంచి లక్ష్మీ చాలీసా లేదా లక్ష్మీ సహస్ర నామాలు పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని చెబుతున్నారు.

  Last Updated: 08 May 2025, 01:44 PM IST