లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. వ్రతాలు నోములు కూడా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కేవలం ఇవి చేయడం వల్ల మాత్రమే కాదండోయ్ కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల కూడా కలుగుతుందట. అలాగే మనం వాస్తు ప్రకారం గా చేసే కొన్ని కొన్ని తప్పులు వల్ల లక్ష్మికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలట.
అలాగే తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల పొరపాట్లను అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండే ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందట. నిత్య దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీ ఎప్పుడు తాండవిస్తూ ఉంటుందట. అయితే అమ్మవారి అనుగ్రహం కలిగి ఇంట్లో ఎప్పుడు సంపద నిలవాలి అంటే ఇప్పుడు చెప్పబోయే వస్తువులను గుమ్మానికి కడితే మార్పులను మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు. మరి గుమ్మానికి ఎలాంటి వస్తువులు కట్టాలి అన్న విషయానికి వస్తే..
ముందుగా ఒక ఎరుపు రంగు నూతన వస్త్రాన్ని తీసుకోవాలట. ఆ తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో లక్ష్మీదేవికి ఇష్టమైన గుప్పెడు గళ్ళ ఉప్పు, నవధాన్యాలు, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, పచ్చ కర్పూరం వేసి మూట కట్టాలట. అలా కట్టిన తర్వాత మనసులో మీరు అనుకున్న కోరికను కోరుకొని పూజ చేసి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి ఈ మూటను కట్టాలని చెబుతున్నారు. ఈ పరిహారం పాటిస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అని చెబుతున్నారు పండితులు.