Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 06:52 PM IST

Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ ఎప్పటివలనే ఏకాంతంగానే జరిపించబడుతాయి.

ఈ పూజాదికాల తరువాత శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు మొదటి వాటితో సాత్వికబలిగా సమర్పించబడుతాయి. ఈ సందర్భంగానే హరిహరరాయగోపురద్వారం వద్ద గల మహిషాసురుమర్థిని అమ్మవారికి: కోటమ్మవారికి ప్రత్యేకపూజాదికాలను జరిపించి సాత్మికబలిగానే కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించబడుతుంది. ఆనంతరం శ్రీస్వామివారి ఆలయద్వారాలు మూసివేయబడుతాయి.