వాస్తు శాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఈశాన్య దిక్కును కుబేరుడి స్థానంగా పిలుస్తారు. కుబేరుడు ధన,సంపదలకు అధిపతి అన్న విషయం తెలిసిందే. ఈ ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఈశాన్య దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
ఈ పూజ గదిలో ఎప్పుడూ బరువైన వస్తువులు పెట్టకూడదు. బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయట. ఇంట్లో పూజ గదిలో కుబేర యంత్రం ప్రతిష్టించడం వల్ల ధన లాభం కలుగుతుందట. కుబేర యంత్రాన్ని ఇంట్లోనే ఉత్తర దిశలో ప్రతిష్టించడం వల్ల ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అని చెబుతున్నారు. అలాగే కుబేరుడిని యంత్ర రూపంలో పూజించి ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. కొత్త ఇల్లు కట్టేటప్పుడు కూడా కుబేరుడి దిశను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం తప్పక లభిస్తుందట.
ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య దిశలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. అలాగే చెప్పులు, చెత్తను ఈశాన్యంలో ఉంచకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే బాత్రూమ్ ను ఈశాన్యంలో నిర్మించకూడదట. బాత్రూమ్ కట్టడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. డబ్బును ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టాలట. ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుందట. అలాగే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు. మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదట. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలట. ఇలా పైన చెప్పిన నియమాలు పాటిస్తే తప్పక కుబేర అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.