రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం అని చెప్పవచ్చు. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ ఉగాది అని చెప్పాలి. అయితే ఈ సారి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 9న ఉగాది పండుగ వచ్చింది. అయితే ఉగాది పండగ శోభ రెండు మూడు రోజుల నుంచే ప్రారంభమవుతోంది.
We’re now on WhatsApp. Click to Join
ఉత్తరాదిన వసంత నవరాత్రలని అమ్మవారిని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. ఈ నవరాత్రుల్లో చివరి రోజైన నవమి నాడు.. శ్రీరామనవమితో వసంత నవరాత్రులు ముగుస్తాయి. ఉగాది పండగ రోజున ఇంటిని శుభ్రంగా కడుక్కొని పండుగ రోజున మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు రంగు రంగుల రంగవళ్లులు గీయాలి. ఉదయమే స్నానం, సంధ్యానుష్ఠానం నిర్వర్తించుకొని ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లాలి. అంతేకాదు ఒంటికి నూనెతో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. ఉగాది సూర్యుడికి సంబంధించిన కాల పండగ. కాబట్టి సూర్యుడికి ప్రత్యేక నివేదాలు చేయాలి.
Also Read: Gifts: కొత్తగా పెళ్లైన దంపతులకు పొరపాటున కూడా ఈ గిఫ్ట్ లు అస్సలు ఇవ్వకండి!
స్నానం అనంతరం మన ఇంట్లో తరాతరాలుగా ఏదైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామే అది చేయాలి. మన ఇంటి ఇలవేల్పును ప్రత్యేకంగా పూజించాలి. ఉగాది రోజున ఇంట్లో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. జీవితంలో కేవలం తీపి మాత్రమే కాదు.. పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే ఆరు రుచుల ఉన్నట్టే జీవితంలో సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఆనందంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు బోధిస్తోంది. అలాగే కొత్త వ్యాపారానికి ఇంకా ఏదైనా కొత్త పనులకు ఈ రోజు ఎలాంటి మూహూర్తం చూడాల్సిన పనిలేదు. ఆలయానికి సందర్శించాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. మొత్తంగా పెళ్లి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకోవచ్చు. రోజు మొత్తం వివిధ కార్యక్రమాలతో సాగే పండుగ ఉగాది. ఉదయం అభ్యంగనస్నానంతో మొదలైన ఈ పండుగ సాయంత్రం పంచాంగ శ్రవణంతో ముగుస్తుంది.
Also Read; Vastu Tips: మీ ఇంట్లో రావి చెట్టు పెరిగిందా.. అయితే వెంటనే ఇలా చేయండి?
ఈ పండుగ కోసం ఇంటిని పూర్తిగా శుభ్రపరుచుకోవాలి. పండుగ రోజున మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు రంగురంగుల రంగోలీలు గీయాలి. స్వస్తిక్ చిహ్నాన్ని కచ్చితంగా గీయాలి. పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. శనగపిండిని శరీరానికి రాసుకుని నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఇంటిని, పరిసరాలను ఆవు పేడతో శుభ్రం చేయాలి. ఉగాది రోజు విష్ణువును పూజిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున విష్ణువుకు, బ్రహ్మదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరువాత, చేతుల్లో పువ్వులు, అక్షితలు, గంధం, నీరు పట్టుకుని బ్రహ్మదేవుని మంత్రాలను జపించాలి. కార్తికేయుడు, వినాయకుడు సౌభాగ్యాలకు, శ్రేయస్సుకు దేవుళ్లుగా భావిస్తారు. అందువల్ల ఈ దేవతలకు ప్రీతిపాత్రమైన మామిడి తోరణాన్ని ఇంటి గుమ్మానికి అలంకరించాలి. ఇంటి దైవమైన కులదేవుడిని ఈ రోజున పూజిస్తే మంచిది. ఉగాది రోజున ఈ విధంగా చేయడం వల్ల కష్టాల నుంచి బయటపడవచ్చు.