Shani Devi: శనిగ్రహదోషాలు తొలిగిపోవాలంటే ఈ కృష్ణ తులసితో ఈ పని చెయ్యండి!

హిందువులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను ఒక దివ్య ఔషధ మొక్కగా కూడా

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 07:30 AM IST

హిందువులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను ఒక దివ్య ఔషధ మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ తులసి మొక్క వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా తులసి మొక్కలు మూడు రకాలు. అవి రామ తులసి, ఇది ఆకుపచ్చ ఆకులను కలిగి ఉంటుంది. కృష్ణ తులసి, ఇది ఊదా రంగు ఆకులను కలిగి ఉంటుంది. వర్ణ తులసి, ఇది ఒక అడవి రకం మరియు లేత ఆకుపచ్చ ఆకులను కలిగి ఉంటుంది. మన పూర్వీకులు ఈ తులసి మొక్కలను అప్పటి నుంచే పూజించడంతో పాటుగా ఎన్నో రకాల మందుల వాడకాల తయారీలో కూడా ఈ తులసి మొక్కను ఉపయోగిస్తూనే ఉన్నారు.

అందుకే హిందువులు ఇంటిదగ్గర తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను ఇంటి బయట ఉంచడం ద్వారా నుంచి వచ్చే నెగటివ్ ఎనర్జీని తులసి మొక్క రాకుండా అడ్డుకుంటుంది. అయితే శని గ్రహ దోషాలు తొలగిపోవాలి అన్న కూడా తులసి మొక్కను పూజించాల్సిందే. మరి ఎటువంటి తులసి మొక్కను పూజించాలి అన్న విషయానికి వస్తే.. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల లక్ష్మి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది.

సూర్యోదయ కాలమందు తులసి మాలను ధరించిన, పూజించిన విష్ణువును దర్శించినంత పుణ్యఫలములు లభిస్తాయి. అలాగే శని గ్రహ దోషాలు ఉన్నవారు, ఆయుర్ధామ సమస్యలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. ఏలినాటి శని బాధలు తొలగిపోవాలి అంటే కృష్ణ తులసికి పూజ చేయడం మంచిది. కృష్ణ తులసిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని గ్రహ దోషాలు తొలగిపోతాయి.