Site icon HashtagU Telugu

Maha Shivalayam : ఏడాదిలో 27 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

Kottiyoor Maha Siva Temple

Kottiyoor Maha Siva Temple

కేరళ (North Kerala) రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా సమీపంలో ఉన్న కొట్టియూర్ మహా శివాలయం (Kottiyoor Maha Siva Temple) ఒక అపురూప దేవస్థానంగా నిలుస్తోంది. ఈ ఆలయం కన్నూర్ పట్టణానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవుల్లో, నదీ తీరం వద్ద వుంటుంది. ఇది కేవలం ఏడాదిలో ఒక్కసారి, 27 రోజుల పాటు మాత్రమే తెరుస్తారు. ఈ ప్రత్యేక సమయం వైశాఖ మాసంలో నిర్వహించే వైశాఖ మహోత్సవం సందర్భంగా జరుగుతుంది. 2025లో ఈ ఆలయం జూన్ 8 నుంచి జులై 4 వరకు భక్తులకు దర్శనమివ్వనుంది.

Telangana : ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వాసి మృతి

ఈ ఆలయం విశిష్టత చూస్తే.. ఇక్కడ శాశ్వత కట్టడం కాదు. ఏటా గుడిసె తరహాలో పూరి తాటి ఇళ్లతో ఆలయ నిర్మాణం జరిపి, ఉత్సవం ముగిసిన తర్వాత వాటిని పునః నిర్మించేందుకు తిరిగి తొలగిస్తారు. నదీ ప్రవాహానికి మధ్య ఉన్న ఈ ఆలయం చుట్టూ గ్రీనరీ, శాంతత్మక వాతావరణం భక్తులను ఆకర్షిస్తుంది. ప్రకృతితో మమేకమైన తీర్థక్షేత్రంగా కొట్టియూర్ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు, పూజలు కేవలం స్థానిక పండుగలకే పరిమితం కాకుండా, దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తాయి. మహాదేవుని పట్ల భక్తి గల వారు ఈ 27 రోజుల్లో తప్పకుండా అక్కడికి వెళ్లి దైవదర్శనం పొందాలని భావిస్తారు. ఈ ఆలయ విశేషాలు, ప్రత్యేకతలతో కూడిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొట్టియూర్ శివాలయం ఇప్పుడు కేవలం ఓ ఆలయంగా కాక, ప్రకృతి మాధుర్యాన్ని ఆస్వాదించదగిన పవిత్ర ప్రదేశంగా నిలుస్తోంది.