Site icon HashtagU Telugu

Koti Deepostavam : ఈ నెల 14 నుంచి హైద‌రాబాద్‌లో కోటి దీపోత్స‌వం

koti deepotsavam

koti deepotsavam

శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.. శివలింగం. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచిక. శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే, శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. కార్తీక మాసంలో శివుడితో పాటు మరెన్నో శుభప్రదమైన దైవాలను కళ్ల ముందు నిలిపేందుకు ప్ర‌ముఖ మీడియా సంస్థల అధినేత‌ తుమ్మల నరేంద్ర చౌదరి ప్ర‌తి ఏటాలానే ఈ ఏడాది కూడా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 14 నుంచి 27వ తేదీ వ‌ర‌కు కోటీ దీపోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. లింగం ఆకాశమనీ, భూమి దాని పీఠమనీ, ఇది సర్వదేవతలకు స్థానమ‌ని సర్వం ఇందులోనే లయమవుతున్నది కనుక శివలింగ దర్శనంతో దైవ అనుగ్ర‌హ‌ అనుభూతిని కలిగించేందుకు కోటి దీపోత్సవ ఉద్దేశమ‌ని నిర్వాహకులు నరేంద్ర చౌదరి చెప్పారు.

Also Read:  CBN : చంద్ర‌బాబు రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ న‌వంబ‌ర్ 15కి వాయిదా వేసిన హైకోర్టు