ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక స్థలంగా పేరుగాంచిన మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) భక్తులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే దాదాపు 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సాధారణ భక్తులతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రముఖులు కూడా ఈ పవిత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మహా కుంభమేళాకు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. కోట్లాది మంది భక్తుల మధ్య కూడా అద్భుతమైన ఏర్పాట్లు ఉండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మహా కుంభమేళాలో పాల్గొనడం జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశమని పేర్కొన్నారు. ఇటీవల తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఆత్మశాంతికి ప్రార్థనలు చేశానని తెలిపారు.
Chilkur Balaji : బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుల అరెస్ట్
మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy)తో పాటు తెలంగాణ నుంచి ఇతర ప్రముఖులు కూడా మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావు సతీసమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ నగరాల్లో మహా కుంభమేళా జరుగుతుంది. వీటిలో ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభమే అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 13న ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు ముగియనుంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#KomatireddyVenkatReddy #MahaKumbhMela2025 #HashtagU pic.twitter.com/LZST30cHO9
— Hashtag U (@HashtaguIn) February 10, 2025