Site icon HashtagU Telugu

TTD: తిరుపతిలో త్వరలో కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Bomb Threats In Tirumala

Bomb Threats In Tirumala

TTD: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు  జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.

వాహనసేవల వివరాలు :

01-03-2024

ఉద‌యం – ధ్వజారోహణం

రాత్రి – హంస వాహనం

02-03-2024

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

03-03-2024

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

04-03-2024

ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

05-03-2024
ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

06-03-2024

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

07-03-2024

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

08-03-2024

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

09-03-2024

ఉద‌యం – పురుషామృగవాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

10-03-2024

ఉద‌యం – త్రిశూలస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం