మామూలుగా మనం ఎటువంటి ఆలయానికి వెళ్లినా కూడా ముందుగా గుడిలోకి ప్రవేశించగానే గుడిగంటను మోగిస్తాం. గుళ్లో గంటను కొట్టి దేవుడిని మొక్కుకున్న తర్వాత ఆ తర్వాత ప్రదక్షిణలు చేయడం పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా గుడికి వెళ్ళిన వారు గంట కొట్టనిదే ఆలయం నుంచి బయటికి రారు. అయితే గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొందరు గంట కొడితే మరి కొందరు మాత్రం అలాగే వచ్చేస్తూ ఉంటారు. కానీ గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా గంట కొట్టడం తప్పనిసరి అని మీకు తెలుసా? గంట మోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయ గంట మోగించడం అన్నది గుడిలోకి ప్రవేశించడానికి అనుమతి కోరడానికి సంకేతంగా భావించాలి. మనం గుడిలో గంటను మోగించినప్పుడు, గంట శబ్దం మన మనస్సు, మెదడు అన్ని చక్రాలను క్రియాశీలం చేస్తుంది. అదే సమయంలో దేవతలందరూ మనవైపు ఆకర్షితులవుతారు. ఆలయ గంటను మోగించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మీ చుట్టూ పాజిటివ్ లేదా పాజిటివ్ ఎనర్జీ తరంగాలను పెంచుతుంది. ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు తమకు అనుకూలమైన అనుభవం ఉందని చాలా మంది చెప్పడం మీరు వినే ఉంటారు. ఆలయంలో అతనికి పాజిటివ్ ఎనర్జీని అందించిన అంశాలలో గంట ఒకటి.
గుడి గంటను మోగించడం ద్వారా భగవంతుడిని మేల్కొల్పవచ్చు. గంట మోగించడం వల్ల దేవతలు సంతోషిస్తారు. ఈ కారణంగా మనం గుడిలోకి ప్రవేశించేటప్పుడు, ఆలయం నుంచి తిరిగి వచ్చేటపుడు గంట మోగించాలి. భగవంతుడిని మేల్కొలిపి మన చిత్తాన్ని భగవంతునిపై నిమగ్నం చేయడం వల్ల వారందరూ త్వరలోనే భగవంతుడిని చేరుకుంటారు. ఆలయ గంటను మోగిస్తే, దాని నుంచి వెలువడే పెద్ద శబ్దం శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తుంది. ఇది ఆలయంలో మనకు వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్‌లను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. శరీరంలోని సప్తచక్రాలు చైతన్యవంతం అయినందున, ఆరాధన ద్వారా పొందిన భక్తి మనలో నిలిచి ఉంటుంది.ఆలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం వల్ల శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. మీరు గుడి నుంచి బయలుదేరే ముందు గంటను మోగిస్తే, మీ సందేశం నేరుగా దేవునికి చేరుతుంది. దాంతో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.