Site icon HashtagU Telugu

Puja Niyam: మధ్యాహ్నం సమయంలో పూజ చేయకూడదా.. చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Mixcollage 18 Dec 2023 05 25 Pm 2270

Mixcollage 18 Dec 2023 05 25 Pm 2270

మామూలుగా హిందువులు దీపారాధన విషయంలో పూజ విషయంలో ఎన్నో రకాల నియమాలను పాటిస్తూ ఉంటారు. అందులో మధ్యాహ్నం సమయంలో దేవుడికి పూజ చేయకూడదు అన్న నియమం కూడా ఒకటి. ఈ నియమాన్ని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందట. హిందూ సంస్కృతి, సంప్ర‌దాయంలో, రోజువారీ దినచర్యలో ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పూజ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని, తమ జీవితాల్లో ముందుకు సాగేందుకు ప్రేర‌ణ పొందుతామ‌ని ప్రజలు నమ్ముతారు. మరి పూజకు సరైన సమయం ఏది అన్న విషయానికి వస్తే..

తెల్లవారుజామున పూజకు ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం, మనస్సు రెండూ స్వచ్ఛంగా ఉంటాయి. ఇది భగవంతుని ఆరాధనలో మన దృష్టిని, భక్తిని కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది. అందువ‌ల్ల ఈ సమయంలో పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉదయం సమయంలో అలాగే సాయంత్రం సమయంలో పూజ చేయడం మంచిది. మన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టినప్పుడల్లా శుభ ముహూర్తం కోసం చూస్తూ ఉంటాం. సరైన సమయంలో చేసే పూజలను భ‌గ‌వంతుడు స్వీకరిస్తాడని నమ్మకం. అంటే ఇతర సమయాల్లో చేసే పూజల వల్ల మనకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ ప్రార్థనలను భ‌గ‌వంతుడు అంగీకరించదు.

ఇత‌ర స‌మ‌యాల్లో మనం చేసే ప్రార్థన లేదా పూజలను భ‌గ‌వంతుడు ఎలా అంగీకరించడో మధ్యాహ్న సమయం పూజ‌కు కూడా అదే ఫ‌లితం వ‌ర్తిస్తుంది. మధ్యాహ్నం పూజలు చేసినా కూడా ఫలితం ఉండదని, ఆ సమయంలో పూజించినా ఫలితం దక్కదని అంటారు. దీనికి కారణం మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య భ‌గ‌వంతుడు విశ్రాంతి తీసుకునే సమయం. ఈ సమయంలో చేసే పూజను ఆయ‌న్ను అంగీకరించడు. ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. ఇది పూర్వీకుల కాలం. అందుకే భ‌గ‌వంతుడు ఈ పూజను లేదా ప్రార్థనను అంగీకరించడు.