Site icon HashtagU Telugu

‎Amavasya: అమావాస్య రోజు ఉపవాసం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Amavasya

Amavasya

‎Amavasya: అమావాస్య రోజును చాలామంది పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఇంకొందరు అమావాస్య అంటేనే చాలు భయపడుతూ ఉంటారు. కాగా అమావాస్య తిథిని పితృ కార్యాలు, దానధర్మాలు, స్నానం, ధ్యానం , వ్రతాల వంటి వాటి కోసం ప్రత్యేకంగా ముఖ్యమైనదిగా భావిస్తారు. అదేవిధంగా చాలా మంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఇలా ఉపవాసం ఉండేవారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎అమావాస్య ఉపవాస వ్రతం సమయంలో మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అన్న విషయాలని తప్పకుండా గుర్తించుకోవాలి. వ్రతం సమయంలో ఆహారం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. అమావాస్య వ్రతం సమయంలో పూర్తిగా ఫలాహారం పాటించాలి. మీరు సీజనల్ పండ్లు, జ్యూస్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చట. అలాగే ఈ ఉపవాసంలో చాలా మంది సైంధవ లవణం తో చేసిన వస్తువులు, కట్టు పిండితో చేసిన రొట్టెలు, పాయసం కూడా తింటారు. కానీ ఉపవాసంలో తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. కంది, పెసర, మసూర్, రాజ్మా, శనగలతో పాటు, మినుము వంటి పప్పుధాన్యాలు తినకూడదట.

‎సొరకాయ, దొండ, పాలకూర వంటి కొన్ని కూరగాయలు కూడా తినకూడదని చెబుతున్నారు. అంతేకాకుండా ఉపవాసంలో సాధారణ ఉప్పు, ఉల్లిపాయ,వెల్లుల్లి, గుడ్డు లేదా మాంసం, చేపలు, అధిక నూనె కలిగిన పదార్థాలు నూడుల్స్, బిస్కెట్లు, బ్రెడ్, నంకీన్, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలను కూడా తినకూడదని చెబుతున్నారు. అలాగే అమావాస్య రోజు ఉపవాసం ఉండేవారి ఇంట్లో మాసం తినడం, మద్యం సేవించడం లాంటివి అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట.

Exit mobile version