Spirtual Plants: దనవంతులు అవ్వాలా అయితే.. ఈ చెట్లను పూజించాల్సిందే.?

Spirtual Plants: మానవ జీవితంలో చెట్లు ముఖ్యపాత్రను పోషిస్తాయి అని చెప్పవచ్చు. ఎందుకంటె చెట్లు ఆక్సీజన్ ను అందిం చడం తో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. భారత్ లో కొన్ని రకాల చెట్లను దేవతలుగా భావించి పూజిస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 19, 2022 / 07:30 AM IST

Spirtual Plants: మానవ జీవితంలో చెట్లు ముఖ్యపాత్రను పోషిస్తాయి అని చెప్పవచ్చు. ఎందుకంటె చెట్లు ఆక్సీజన్ ను అందిం చడం తో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. భారత్ లో కొన్ని రకాల చెట్లను దేవతలుగా భావించి పూజిస్తూ ఉంటారు. కొన్ని చెట్లను పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసిస్తూ ఉంటారు. మరి ఏ చెట్లను పూజించడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు తులసి చెట్టుని పూజించి అనంతరం నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరిగి లక్ష్మి దేవి కూడా సంతోషం పడుతుంది. నిత్యం తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయని నమ్ముతారు.

తులసిని పూజించడం వల్ల విష్ణువును అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అలాగే మర్రిచెట్టు ను పూజించాలి. మర్రి చెట్టుని బ్రహ్మ, విష్ణువు, శివుని భావించడంతోపాటు విష్ణు బెరడులో బ్రహ్మ మూలంలో, శివుడు కొమ్మలలో, ఉంటారు అని భావిస్తారు. ప్రతిరోజు మర్రి చెట్టును పూజించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడం మాత్రమే కాకుండా సంతానం కూడా కలుగుతుందట. అదేవిధంగా పూజ గదిలో రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత శమి చెట్టు కింద దీపాన్ని వెలిగించాలి. తప్పకుండా చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరిగి వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అదేవిధంగా ప్రతి శనివారం రోజు ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శని గ్రహ స్థితి నుండి ఉపశమనం లభిస్తుంది.

అదేవిధంగా ప్రతి శనివారం రాగి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని గ్రహస్థితి కలుగుతుంది. రావి చెట్టుని పూజించడం మనం కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్ముతుంటారు. అదేవిధంగా గురువారం రోజున అరటి చెట్టుని పూజించడం శుభ ప్రదంగా భావిస్తూ ఉంటారు. గురువారం రోజు ఉపవాసం ఉండి అరటి చెట్టును పూజించే వారు కూడా నీటిని సమర్పిస్తారు. అరటి చెట్టును పూజించడం వల్ల బృహస్పతి బలపడతాడని, విష్ణువు కూడా ప్రసన్నుడని చెబుతారు.