Shani dev: శని దేవుని విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోరో తెలుసా..?

భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు అనేక రకాల దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 06:30 AM IST

భారతదేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు అనేక రకాల దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక దేవుడికి ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా పూజ గదిలో దేవుడి పటాలతో పాటు దేవుడి విగ్రహాలను కూడా పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇళ్లలో మనకు ఎక్కువగా రాముడు, శివుడు, రాధాకృష్ణులు, వినాయకుడు లాంటి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విగ్రహాలతో పాటు మిగతా దేవుళ్ళ విగ్రహాలను కూడా ఇంట్లో పూజిస్తూ ఉంటారు. కానీ ఇళ్లలో నవగ్రహ విగ్రహాలు మాత్రం ఉండవు. ఈ నవగ్రహ విగ్రహాలు మాత్రం ఎవరి ఇంట్లో కూడా ఉండవు.

నవగ్రహ విగ్రహాలు కేవలం ఆలయంలో మాత్రమే ఉంటాయి. అయితే సాధారణంగా మనము ఆలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహ పూజలు చేస్తూ ఉంటాం. మనపై ఉన్న చెడు దృష్టి, శని దోషాలు పోవాలని పూజిస్తూ ఉంటాం. అలాగే శని దేవునికి తైలాభిషేకం చేసి ఏలినాటి శని పోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే నవగ్రహ విగ్రహాలను ఇంట్లో ఎందుకు పెట్టుకోకు అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దేవుని చూసి భయపడే వారి సంఖ్య ఎంత ఉంటుందో శని దేవుని ఆరాధించే వారి సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుంది.

ఆలయాలకు వెళ్లి శనీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇళ్లలో మాత్రం శని విగ్రహాలు ఉండవు. శనిదేవుడు ఎవరినైనా చూసిన వారు చెడు స్థితిలో ఉంటారని శాపం ఉంది. అందుకే శని దృష్టిని నివారించడానికి శని దేవుబీ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించరు. అలాగే ఆలయంలో శని దేవుని ఆరాధించే సమయంలో కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి.. పూజ చేసేటప్పుడు శని వైపు అసలు చూడకూడదు. శనీశ్వరునికి ఎదురుగా నిలబడకూడదు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. శని పాదాలను చూస్తూ పాదాలను మాత్రమే పూజించాలి. శనివారం రోజు హనుమంతుడితో పాటు శని దేవునికి పూజ చేయడం మంచిది.