Site icon HashtagU Telugu

Past Life: ప్రతి ఒక్కరు పూర్వజన్మను మరిచిపోవడానికి గల కారణం ఇదే?

Past Life

Past Life

మామూలుగా చాలా సందర్భాలలో చాలామంది గత జన్మల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా గత జన్మలో వారు ఏ విధంగా జన్మించారు. వారికి గత జన్మ ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. అయితే మామూలుగా ఒక రెండు మూడు సంవత్సరాల కిందట ఏం జరిగింది అని అడిగితేనే మనం మరిచిపోతూ ఉంటాము. అటువంటిది గత జన్మలో ఎలా పుట్టాము అసలు మన గత జన్మ ఏమిటి అన్నది ఎవరిని అడిగినా కూడా చెప్పడం అసాధ్యం అని చెప్పవచ్చు. వయసుతో పాటుగా జ్ఞాపకాలు కూడా ఆ మసకబారుతాయి.

ఒకవేళ గత జన్మ అనేది ఉంటే ఆ జన్మలో ఏం జరిగింది? మనం ఏ విధంగా జన్మించాము అన్న విషయాలు ఎందుకు గుర్తుకు ఉండవు దానికి గల కారణం ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శాస్త్రీయ దృక్కోణంలో, మన మెదడు గత జ్ఞాపకాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోలేని విధంగా నిర్మాణాత్మకంగా పని చేస్తుంది. మనస్సు కొత్త వాటిని గుర్తుంచుకునేలా, పాతవాటిని మరచిపోయేలా పనిచేస్తుంది. దీనివల్ల అనవసరమైన జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి మెదడుపై భారం ఉండదు. అందుకే ఇది సరిగ్గా పనిచేస్తుంది. సాధారణంగా మన జీవితంలో చాలా చెడు విషయాలు జరుగుతుంటాయి.

మనిషి మనసు పాత సంగ‌తుల‌ను మరచిపోలేకపోతే, కొత్త జీవితాన్ని ప్రారంభించడం అసాధ్యం. ఈ కారణంగా, మనకు మన పూర్వ జన్మలోని విషయాలు గుర్తుకు ఉండవు. ఒక వ్యక్తి తన పూర్వ జన్మలో ఎలా మరణించాడో లేదా తన పూర్వ జన్మలో ఏ పని చేస్తున్నాడో అకస్మాత్తుగా గుర్తుకు వస్తే, అతను ప్రస్తుత జీవితంలో కూడా ఆ విషయం గురించి భయపడే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తన బాధలు, ఇబ్బందుల‌ను వదిలించుకోవాలని కోరుకుంటాడు అనేది మత విశ్వాసం. హిప్నటిజం అనే భారతదేశపు పురాతన జ్ఞానం నేటికీ వినియోగంలో ఉంది.

ప్రస్తుతం, ఒకరి గత జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి హిప్నటిజాన్ని ఉపయోగించడం ఉత్తమ మార్గంగా ప‌రిగ‌ణిస్తారు. నేటికీ చాలా మంది తమ గత జీవితాలను గుర్తుంచుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, దీనితో కూడా వ్యక్తి గుర్తుపెట్టుకున్నది నిజమా లేదా అబద్ధమా అనేది పూర్తిగా కచ్చితంగా తెలియదు. పాత జ్ఞాప‌కాల‌ను మరచిపోకుండా తదుపరి జీవితాన్ని గడపలేం కాబట్టి పూర్వజన్మను మరచిపోతారని చెబితే, మత విశ్వాసాల ప్రకారం, పూర్వజన్మలో జరిగిన సంఘటనలు దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి తన పూర్వ జీవితాన్ని మరచిపోతాడు.

Exit mobile version