దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరూ ఇంటిని మొత్తం చక్కగా దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. ఇక ఇలా దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఇవి ప్రతికూల శక్తులను తొలగించడానికి సహాయపడతాయి. ఈ పద్దతులను పాటించడానికి మీ జాతకం, నక్షత్రంతో పనిలేదు. ముఖ్యంగా మీ ఇంటికి లక్ష్మీదేవి రాక ఉండాలటే దీపాలను కొన్ని దిక్కుల్లో ఖచ్చితంగా పెట్టాలంటున్నారు జ్యోతిష్యులు. మరి ఇంట్లో ఏ దిక్కుల్లో దీపాలను వెలిగించాలి అన్న విషయానికి వస్తే..
ఆవు నేతితో దీపాలను వెలిగించడం శుభప్రదం అని చెబుతున్నారు. అలాగే ఇంటి ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం నైరుతి మూలల్లో దీపాలను వెలిగిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ దీపాలను ధన త్రయోదశి నుంచి దీపావళి వరకు ప్రతి రోజూ కనీసం ఒక గంట పాటైనా దీపాలను వెలిగించాలట. ఇవి పండుగ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా మీ భక్తిని కూడా పెంచుతాయని చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవిని సంతోషింపజేస్తాయట. అలాగే మీ ఇంట్లోనే నెగిటీవ్ ఎనర్జీ పొయ్యేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు. కాగా మీ ఇంటి ఉత్తరం వైపున షార్ట్ బర్నింగ్ కొవ్వొత్తులను వెలిగించండి. అలాగే ఎక్కువ సేపు మండే దీపాలను మీ ఇంటి దక్షిణం వైపున వెలిగించాలి.
ఇవి ప్రతికూల శక్తులను తొలగిస్తాయి. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా దీపావళి పండుగ రోజు ఇంటి ప్రదాన ముఖ ద్వారం ముందు రంగులతో అందమైన ముగ్గులను వేసే సాంప్రదాయం కూడా ఉంది. అందమైన ముగ్గు మధ్యలో కూడా దీపాలను వెలిగిస్తారు. ఇది మీ ఇంటిని అందంగా మార్చడంతో పాటుగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా సహాయపడుతుందట. అయితే ఈ ముగ్గుకు నిర్ధిష్ట రంగులను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు.