Site icon HashtagU Telugu

Peepal Tree: శని అనుగ్రహం కలగాలంటే రావి చెట్టుని ఈ విధంగా పూజించాల్సిందే?

Mixcollage 18 Dec 2023 04 11 Pm 2078

Mixcollage 18 Dec 2023 04 11 Pm 2078

హిందువులు రావి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టుని ఆధ్యాత్మికంగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. రావి చెట్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. అయితే అటువంటి రావి చెట్టుని భక్తిశ్రద్ధలతో పూజించి దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం కలగడం కాయం అంటున్నారు పండితులు. మరి నిజంగానే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుందా? శని అనుగ్రహం కలగాలంటే మళ్ళీ రావి చెట్టును ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏలినాటి శని, అర్ధాష్ట‌మ శ‌ని ప్ర‌భావంతో ఇబ్బంది పడుతున్నప్పుడు రావి చెట్టును పూజించడం మంచిది.

అయితే రావి చెట్టు విష్ణువు మరొక రూపంగా పరిగణిస్తారు. అందుకే ఈ చెట్టుకు శ్రేష్ఠదేవ వృక్షం అనే పేరు వచ్చింది. రావి చెట్టుకు నమస్కరించి, ప్రదక్షిణలు చేసిన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందట. అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోసే వారికి చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు చివరికి స్వర్గం వెళ్తారని నమ్మకం. రావిచెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు. అంతే కాకుండా, అన్ని తీర్థయాత్రలు రావిచెట్టులో ఉంటాయ‌ని చెబుతారు. అందుకే తీర్థయాత్రల‌కు వెళ్ల‌లేని వారు రావిచెట్టు కింద ఈ వ్రతం చేస్తారు. రావిచెట్టు కింద యాగం, పూజ, పురాణ కథ నిర్వహించడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ప్రజలు తమ ఇంటి ప్రవేశద్వారం వద్ద రావి ఆకులను ఉంచ‌డం శుభ‌ప్ర‌దంగా విశ్వ‌సిస్తారు.

అలాగే హిందూ సంప్ర‌దాయం ప్రకారం శనిదేవుడు రావిచెట్టులో నివసిస్తాడ‌ని నమ్ముతారు. శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి దాని కింద దీపం వెలిగించిన వారికి ఏలినాటి శని, అర్ధాష్ట‌మ శ‌ని బాధలు ఉండ‌వు. అలాంటి వారికి శనిదేవుని ఆశీస్సులు ల‌భిస్తాయి. రావి చెట్టుని పూజిస్తే శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శని అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే.