Food Rules: భోజ‌నానికి ముందు కంచం చుట్టూ నీళ్లు ఎందుకు చల్లుతారో మీకు తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు భోజనం విషయంలో ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో భోజనానికి ముందు కంచం చుట్టూ నీళ్లు

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 03:45 PM IST

హిందూ సంప్రదాయం ప్రకారం హిందువులు భోజనం విషయంలో ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో భోజనానికి ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లడం కూడా ఒకటి. చాలామంది అరిటాకులో కానీ ప్లేటులో కానీ ఇలా ఏ వస్తువులు తిన్నా కూడా తినే ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఈ విధంగా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆహారం ఉన్న కంచం లేదా ఆకు చుట్టూ ప‌రిషేచ‌నం అనగా నీళ్లు చల్లడం అన్నది పూర్వకాలం నుంచి కొనసాగుతోంది.

ఇప్పటికీ చాలా మంది ఈ నియ‌మాన్ని పాటిస్తున్నారు. ఇలా చేసినప్పుడు, మనం తినే ప్రదేశంలో ప్రతికూలత ప్రవేశించకుండా కంచం చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. దీనికి మరొక కారణం కూడా చెప్పారు. తినడానికి ముందు కంచం చుట్టూ నీరు చల్లడం ద్వారా ఆహారం అందించే అన్నపూర్ణ దేవికి, మన ఇష్ట దైవానికి మనం గౌరవం చూపడ‌ంతో పాటు వారికి మ‌న‌ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అర్థం. అలాగే మతపరమైన కారణంతో పాటు ఈ ఆచారం వెనుక‌ శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చుని తినేవారు. అనేక క్రిమి కీట‌కాలు నేల‌పై తిరుగుతుంటాయి.

అటువంటి పరిస్థితిలో ఆహారం ఉన్న కంచం నుంచి వాటిని దూరంగా ఉంచడానికి లేదా కంచంలోకి అవి ప్రవేశించకుండా నిరోధించడానికి, దాని చుట్టూ నీరు చల్లేవారు. పూర్వ కాలంలో ఇంటి లోప‌ల‌ నేల మట్టితోనే తయారు చేసేవారు. అందువ‌ల్ల నీరు చల్లడం ద్వారా మట్టిని త‌డి చేస్తుంది, ధూళి గాలిలో ఎగరడానికి అనుమతించదు. ఫ‌లితంగా మన కంచంలోని ఆహారం శుభ్రంగా ఉంటుంది. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది కింద కూర్చొని భోజనం చేయడం ఇష్టం లేక మంచంపై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అస్సలు మంచిది కాదు.