హిందువులు విజయదశమి పండుగను 10 రోజులపాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తొమ్మిది రోజులు అమ్మవార్లను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో పూజించడంతోపాటుగా భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. అలాగే నిష్టగా ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ నవరాత్రుల్లో కొబ్బరికాయ, తమలపాకులను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు.
అసలు ఈ నవరాత్రల్లో కొబ్బరికాయను, తమలపాకులను ఎందుకు పూజిస్తారో, ఇలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నవరాత్రి పూజలో ఎన్నో వస్తులను ఉపయోగిస్తారు. వేటికవే వాటి ఇవి వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మీకు తెలుసా? పూజలో ఉపయోగించే తమలపాకును వినాయకుడికి చిహ్నంగా భావిస్తారు. అలాగే కొబ్బరికాయను లక్ష్మీదేవికి రూపంగా భావిస్తారు. నవరాత్రుల ఆరాధనలో ఈ రెండింటిని ఉపయోగిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా పూజ సజావుగా పూర్తవుతుందని చెబుతున్నారు. నవరాత్రిలో పూజ పూర్తయిన తర్వాత తమలపాకును మీ వద్ద ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారట.
అవును పూజలో ఉంచిన తమలపాకు వల్ల మీకు డబ్బు కొరత ఉండనే ఉండదర. అలాగే నవరాత్రుల ఆరాధనలో ఉంచి తమలపాకును డబ్బులన్న చోట పెట్టాలని చెబుతున్నారు. దీనివల్ల మీ సిరిసంపదలు పెరగడంతో పాటుగా మీ ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు. నవరాత్రి పూజలో ఏకాక్షి కొబ్బరికాయను ఉపయోగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్నే శ్రీఫలం అని కూడా అంటారు. కొబ్బరికాయను పూజించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు ఒక్క కొబ్బరికాయను పెడతారు. ఇలా పూజించడం వల్ల మీ జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్మకం.