Site icon HashtagU Telugu

Facts Of Lamp: ఇంట్లో దీపారాధన చేస్తున్నారా? అయితే ఈ నియమాలు తప్పనిసరి..

Deeparadhana Niyamalu

Deeparadhana Niyamalu

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఆ దేవదేవులని నమస్కరించడం ఆనవాయితిగా వస్తుంది. ఇలా నిత్యం భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ పూజలు చేస్తుంటారు. అయితే ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ ఈ దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎలా పడితే అలా దీపారాధన చేయటం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉండవు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసే సమయంలో తప్పనిసరిగా స్నానం చేయాలి. స్నానం చేసిన అనంతరం దీపారాధన చేయటం వల్ల ఆ దేవుళ్ల అనుగ్రహం మనపై ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి పూజ చేయాలి ఒకవేళ సాయంత్రం స్నానం చేయడానికి కుదరని పక్షంలో శుభ్రంగా కాళ్లు చేతులు కడిగి పూజ చేయాలి. ఇలా నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి దుష్టశక్తులు ప్రవేశించవు అలాగే ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి మనం చేసే పనులు కూడా ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయి.

ఏ ఇంట్లో అయితే నిత్యం దీప ధూపాలను వెలిగిస్తారో  ఆ ఇంట్లో ఇబ్బందులు ఉండవని, ఆ ఇంట్లో పిల్లాపాపలతో పాటు పెద్దల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. ఇకపోతే ఇంట్లో దీపారాధన చేయడానికి ఆముదం లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి. గోనేతితో దీపారాధన చేస్తే మరింత గొప్ప ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు దీపారాధన స్టీల్ ప్రమిదలో చేయడం మంచిది కాదు మట్టి లేదా ఇత్తడి ప్రమిదలలో దీపారాధన చేయడం శుభకరం.