Vastu Tips : ఇంటి తాళంచెవి ఈ ప్రదేశంలో పెడుతున్నారా..?అయితే పొరపాటు అస్సలు చేయకండి..!!

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 09:02 PM IST

ఇంటికి గుమ్మం ఎంత ముఖ్యమో…గుమ్మానికి తాళం అంతే ముఖ్యం. ఆ ఇంటిని రక్షించడమే కాదు..వాస్తుశాస్త్రంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంట్లో తాళం చెవి సరైన దిశలో ఉంటే..ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి భద్రతను కూడా నిర్దారిస్తుంది. వాస్తుప్రకారం..తాళం చెవిలను ఎక్కడ ఉంచాలి. ఏ దిశలో ఉంచకూడదో తెలుసుకుందాం.

తాళంచెవిని ఉంచడానికి దిశ:
ఇల్లు, అల్మారాలు, సేఫ్ లాకర్లు, వాహనాలు భద్రంగా ఉంచేందుకు తాళంచెవిలను ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరికీ తాళాలు ఉంటాయి. కానీ వాటిని ఎక్కడ ఉంచాలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా మంది ఇంట్లో సులభంగా చేరుకోగలిగే, మరచిపోలేని ప్రదేశంలో తాళాలను ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం తాళాలను ఎక్కడ ఉంచాలో నిర్దేశించిన ఆదేశాలు ఉన్నాయి. అవేంటంటే ఇంట్లో ఎక్కడా తాళాలు ఉంచకూడదు. కానీ దాని కోసం ఏర్పాటు చేసిన నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన తాళాలు సానుకూల లేదా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఇక్కడ తాళంచెవి పెట్టడం సరికాదు:
వాస్తు శాస్త్రం ప్రకారం డ్రాయింగ్ రూంలో తాళాలు పెట్టకూడదు. ఎందుకంటే ఇంటి తాళాలు డ్రాయింగ్ రూంలో పెడితే బయటి నుంచి వచ్చేవారంతా వాటిని చూస్తారు. ఇది శుభప్రదం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజాగదిలో తాళాలను ఉంచకూడదు. ప్రార్థనా స్థలం ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అపరిశుభ్రంగా ఉండి తాళాలను ముట్టాల్సి వస్తుంది. అలాంటి సమయంలో పూజాగదిలో తాళాలు పెట్టినట్లయితే…అది ప్రతికూల శక్తికి దారి తీస్తుంది.

ఇక్కడ తాళాలు పెడితే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి:
వాస్తు శాస్త్రం ప్రకారం, ఆరోగ్యం అనేది ఇంటిలోని వంటగది మొదలుకొని మొత్తం కుటుంబం పురోగతికి సంబంధించినది. కాబాట్టి కీలను వంటగదిలో ఉంచకూడదు.

తాళాలను ఉంచేందుకు ఉత్తమ దిశ:
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంట్లో తాళం చెవిని ఉంచాలనుకుంటే, లాబీలో పశ్చిమ దిశను ఉత్తమం. అలాగే కీ చెక్క స్టాండ్ గది ఉత్తర లేదా తూర్పు మూలలో ఉంచాలి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

కీలను ఇలా ఉంచకూడదు:
కీలు ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు, బదులుగా ఒక చెక్క స్టాండ్ ఉపయోగించాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్, కుర్చీ లేదా పిల్లల గదిపై తాళం వేస్తే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.

అలాంటి కీలను ఇంట్లో ఉంచవద్దు:
ఏదైనా తాళం చెవి పనికిరానిది అయితే, డబ్బును కోల్పోయే అవకాశం ఉన్నందున, దానిని వెంటనే ఇంట్లో నుంచి తీసేయ్యండి. తుప్పు పట్టిన లేదా విరిగిన తాళాలు ఇంట్లో ఉంచకూడదు. అలాంటి తాళాలు ఏవైనా వెంటనే తీసివేయండి.