Site icon HashtagU Telugu

Hanuman : చనిపోయిన వారు కలలోకి వస్తున్నారా…పీడ కలలు బాధిస్తున్నాయా..అయితే హనుమంతుడిని ఇలా ఆరాధించండి…!!

Hanuman

Hanuman

హనుమంతుడిని ఆరాధించడం వల్ల బలం, తెలివి పెరుగుతుందని భావిస్తారు. కేవలం మంగళవారం కాకుండా ప్రతి రోజు హనుమంతుడికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల బజరంగబలి ఆశీర్వాదాలు త్వరలో సమకురుస్తాడని, కోరుకునే కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. శక్తికి ప్రతీకగా భావించే హనుమంతుని పూజకు సంబంధించిన ముఖ్యమైన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం. భూత ప్రేత, పిశాచాలకు హనుమంతుడు సింహస్వప్నం. దుష్ట స్వప్నాల ద్వారా చనిపోయిన వారు మీ కలలోకి వస్తున్నారా, అయితే హనుమంతుడిని ఇలా పూజిస్తే భయంకర స్వప్నాలు మీకు రావు.

హనుమంతుడి ఆరాధనలో పరిశుభ్రత చాలా ముఖ్యం:
హనుమంతుని సాధన చేసే సాధకుడు శరీరం మరియు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. చిరిగిన బట్టలు ఉపయోగించకండి

ఏ దిక్కున హనుమత్ సాధన చేయాలి:
తూర్పు మరియు ఉత్తరం దిక్కులు భగవంతుని ఆరాధనకు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, హనుమంతుడిని ఈ దిశలో పూజించవచ్చు, దక్షిణ దిశలో హనుమంతుని విగ్రహాన్ని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.

హనుమాన్ మంత్రాన్ని ఎలా జపించాలి:
హనుమాన్ ఆరాధనలో, పూర్తి భక్తి మరియు విశ్వాసంతో ‘ఓం హనుమంతే నమః’ అనే మంత్రాన్ని పఠించండి. హనుమాన్ జీ మంత్రాన్ని పంచముఖి రుద్రాక్షతో జపించాలి. హనుమంతుని అనుగ్రహం పొందడానికి, మీరు ప్రతిరోజూ కనీసం ఒక జపమాల జపించాలి.

Exit mobile version