Site icon HashtagU Telugu

Gods Idol: దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలను బహుమతిగా ఇవ్వవచ్చా.. ఇవ్వకూడదా?

Gods Idol

Gods Idol

మామూలుగా మనం గృహప్రవేశం, పెళ్లిళ్లు, బర్త్ డే ఇలా చాలా ఫంక్షన్లకు గిఫ్ట్ లను తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే కొందరు దేవుడి విగ్రహాలు ఇస్తే మరికొందరు దేవుడి ఫోటోస్ ఇంకొందరు గడియారాలు, ఫోటో ఫ్రేమ్స్, ఏదైనా నేచర్ కి సంబంధించిన ఫోటోలను ఆ గిఫ్ట్ లుగా ఇస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది ఇలా ఏదైనా మంచి మంచి ఈవెంట్లకు దేవుడి ఫోటోలు విగ్రహాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వినాయకుడి, బొమ్మను ఫోటోలను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. అయితే అలా ఇవ్వవచ్చా అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా మీరు దానం చేయాలి అనుకుంటే మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఎవరైనా ఆలయాన్ని నిర్మిస్తుంటే, మీరు ఆ ఆల‌యంలో ప్ర‌తిష్ఠించేందుకు దేవతల విగ్రహాలను దానం చేయవచ్చు. ఇలా చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు మీ సంపాదనలో కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి ఇవ్వాలి. కానీ దేవుని విగ్రహాన్ని వ్య‌క్తిగతంగా ఎవరికీ దానం చేయకూడదు. మనం ఎవరికైనా దేవుడి విగ్రహం లేదా బొమ్మను బహుమతిగా లేదా దానంగా ఇస్తే, మనం దేవుడిని మన ఇంటి నుంచి పంపిస్తున్నామని అర్థం. మరోవైపు దేవతా చిత్రాలతో కూడిన వెండి నాణేలు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు. అలాగే కత్తెర, కత్తి, సూది, దారం లేదా ఏదైనా ఇనుప వస్తువును ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు.

ఎందుకంటే ఇది వాస్తు దోషాలను కలిగించడమే కాకుండా పరస్పర విభేదాలను కూడా పెంచుతుంది. ఇది పరస్పర భావాలను సృష్టించడ‌మే కాకుండా మీ సంబంధాలను పాడు చేస్తుంది. అలాగే పొరపాటున కూడా ఎవరికీ తోలు వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. శాస్త్రం ప్రకారం బూట్లు, చెప్పులు, బెల్టులు, పర్సులు వంటి బహుమతులు శుభప్రదమైనవిగా పరిగణించరు. వీటిని బహుమతిగా ఇచ్చే బదులు, ఇతర వ‌స్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఎవరికీ సుగంధ ప‌రిమ‌ళాలు లేదా నూనె బహుమతిగా ఇవ్వకండి. ఇలా ఇవ్వ‌డాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా చాలా మంది సుగంధ ప‌రిమ‌ళాల సీసాల‌ను బహుమతులుగా ఇస్తుంటారు. ఇది ఇచ్చేవారు, పుచ్చుకునే వారి మ‌ధ్య స్నేహాన్ని చెడగొట్టవచ్చు. ఎక్కువ శాతం మంది చేతి గడియారాలు గోడ గడియారాలు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు. అసలు గడియారాలు ఇవ్వకపోవడమే మంచిది.