Site icon HashtagU Telugu

Peepal Tree: రావిచెట్టుకి ప్రదక్షిణలు చేస్తే పిల్లలు కలుగుతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

Peepal Tree

Peepal Tree

హిందూ మతంలో కొన్ని రకాల మొక్కలను దేవుళ్లుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని చెట్లు, పవిత్ర ఆధ్యాత్మిక శ్తులు కలిగి ఉన్నాయని, కొన్ని సమయాల్లో దేవుళ్ళుగా పూజించేవారని చెప్పబడింది. అటువంటి ఆధ్యాత్మిక చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావిచెట్టును విష్ణు స్వరూపంగా భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు. ముఖ్యంగా శనిదోషం ఉన్నవారు రావిచెట్టుకు పూజ చేయాలని,నమస్కరించి, కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయని చెబుతున్నారు.

అలాగే శనివారం రోజు రావి చెట్టుకి పూజలు చేయడం వల్ల శనిదేవుడికి సంబందించిన సమస్యలు ఉంటే తొలగిపోతాయట. ఈ సంగతి పక్కన పెడితే రాగి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే నిజంగా సంతానం కలుగుతుందా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిల్లలు కలగని వారిని రావి చెట్టుకు ప్రదక్షిణలు, తీర్థయాత్రలు చేయమని చెబుతున్నారు. తీర్థయాత్రలు చేయడం వల్ల మనుషులు అలసిపోతారు. దానికి తోడు ప్రశాంతత కూడా వస్తుంది. మానవులు ఆర్థిక బాధల గురించి వ్యాపార వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల మనసు తేలిక పడుతుంది.

తర్వాత ఇద్దరూ ఎక్కువసార్లు ఏకం అవడం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఉంటాయట. అదేవిధంగా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా సంతానం కలగక పోవడానికి కారణమైన దోషాలను రావి చెట్టు గాలి నుంచి తొలగిస్తుందట. అలాగే రావి చెట్టుతో పాటు కొంతమంది సుబ్రహ్మణ్యస్వామి గుడికి తిరిగినా కూడా మంచి జరుగుతుందని, పిల్లలు కలగని వారు సుబ్రహ్మణ్య స్వామి గుడికి తిరిగితే మంచి జరుగుతుందని పిల్లలు తప్పకుండా అవుతారని అంటూ ఉంటారు.