Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ బడా గణేష్ (Khairatabad Ganesh)..ఇక సెలవు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణపయ్య..రేపు తల్లిఒడికి చేరబోతున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. సోమవారం రాత్రి 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు కమిటీ సభ్యులు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ చేయనున్నారు. తర్వాత ఈరోజే మహా గణపతిని పూజారులు కదిలించనున్నారు. రాత్రి 12 గంటల తర్వాత టస్కర్‌పైకి మహా గణపతి ఎక్కిస్తారు.
గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చిన గణపయ్య..ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి గా దర్శనం ఇచ్చారు.మండపైనే స్వామికి ఓ వైపు రాహుకేతుల విగ్రహాలు, మరోవైపు అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉక్కు, మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఆదివారం సుమారు 3 లక్షల మందికి పైగా స్వామి వారిని దర్శించుకున్నట్టు కమిటీ సభ్యులు వివరించారు. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి భక్తులు వచ్చారని తెలిపారు.
మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్‌పైకి చేరుకోనున్నాడు. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో సుమారు 700 మంది పోలీసు బందోబస్తు మధ్య మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఇప్పటికే 30 శాతం గణనాథులను నిమజ్జనం చేయగా, మిగతా గణేశ్ విగ్రహాలను రేపు మంగళవారం నిమజ్జనం చేయనున్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ప్రధాన శోభాయాత్ర (Ganesh Shobha Yatra) కొనసాగనుంది. ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఇతర వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read Also : Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు