Site icon HashtagU Telugu

Dog: ఇంట్లో కుక్కను పెంచడం మంచిదేనా.. కుక్కను పెంచితే ఆ మూడు గ్రహాల అనుగ్రహం లభిస్తుందా?

Mixcollage 02 Feb 2024 04 57 Pm 8670

Mixcollage 02 Feb 2024 04 57 Pm 8670

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్లలో కుక్కను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. పల్లెటూర్ల వాళ్ల సంగతి పక్కన పెడితే సిటీలలో ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. సిటీలో ఉండేవారు ప్రతి పది మందిలో ఎనిమిది మంది కూడా కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలను పెంచుకోవడం మంచిదని అవిశ్వాసాన్ని చూపిస్తాయనిచాలామంది అంటూ ఉంటారు. ఇలా ఏ ఉద్దేశంతో చూసినా కూడా కుక్కలను పెంచుకోవడం శుభమే అంటున్నారు. మరి నిజంగానే కుక్కలను పెంచుకోవడం శుభమా ఈ విషయంపై పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం చాలా శుభప్రదంగా చెప్పబడుతుంది. ఎవరి ఇళ్లలో అయితే కుక్కలను పెంచుతారో ఆ ఇళ్లలో గ్రహాల దోషాలు తొలగిపోతాయట. అలాగే వారి జీవితం సాఫీగా సాగుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. కుక్కలను కేతువుతో సంబంధం ఉన్న జీవులుగా భావిస్తారు. ఇటువంటి కుక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు చెడు కలిగిస్తారని అంతా భావించే గ్రహాలైన శని, రాహువు, కేతువుల ప్రభావం తొలగిపోతుందని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక ఇంట్లో నల్ల కుక్కను ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. ఇంట్లో కుక్కలు ఉంటే ప్రతికూలతలను కుక్కలు తొలగిస్తాయి అని చెబుతారు.

ఇంట్లో నల్ల కుక్క ఉంటే అది ఇంటిని చెడు నుండి రక్షిస్తుందట. నల్ల కుక్కకు రొట్టె ముక్కలను తినిపించడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. దీనివల్ల జీవితంలో శనిదేవుడి కారణంగా ఉండే అనేక ఇబ్బందులు తొలగిపోతయి. కుక్కను కాలభైరవుని వాహనం అని అంటుంటారు. కుక్కకు నూనెతో తయారు చేసిన రొట్టెలను తినిపించడం వల్ల తప్పకుండా కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతాడని, ఇది జీవితంలోని అన్ని కష్టాలను నివారిస్తుందని చెబుతారు. చాలామంది జీవితాలలో తీవ్రమైన గ్రహదోషాలు ఉన్నప్పుడు కుక్కలకు ఆహారం పెట్టమని చెబుతూ ఉంటారు. కుక్కలకు రొట్టెలు పెట్టమని, కుక్కలను కొట్టకూడదని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది కుక్కలను పెంచడానికి ఇష్టపడని వారు, ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటే కుక్కలను పెంచడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన ఇంటిని దుష్టశక్తుల నుండి, గ్రహ దోషాల నుండి కుక్కలు కాపాడతాయట.