Spirtuality: మామూలుగా కొన్ని కొన్ని సార్లు మనం ఎలాంటి పనులు మొదలుపెట్టినా కూడా పనుల్లో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగే ఎక్కడికైనా ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు కూడా ఆ పనులు సరిగా జరగవు. అలాంటప్పుడు చాలామంది నిరాశపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. అయితే మనం ఇలా ఏ పని మొదలుపెట్టిన కూడా జరగకుండా ఉంది అంటే దాని వెనుక తప్పకుండా కొన్ని కారణాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ సంగతి అటు ఉంచితే ఇకమీదట మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కానీ పనులు విజయవంతం అవ్వాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీరు ఏదైనా పనిమీద బయటికి వెళ్లేటప్పుడు వెళ్లిన పని త్వరగా పూర్తి కావాలి అంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరికాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీతో పాటుగా ఏదైనా ఒక బ్యాగులో వేసుకుని తీసుకుని వెళ్లాలి. మీరు వెళ్లిన పని పూర్తి అయిన తర్వాత ఆ టెంకాయను తీసుకొని ఏదైనా ఒక గణపతి ఆలయంలో ఇవ్వాలని చెబుతున్నారు. అలాగే మన ఇంట్లోనే పూజా మందిరంలో తప్పకుండా వక్క గణపతిని ఏర్పాటు చేసుకోవాలట. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ వక్క గణపతికీ కుంకుమ బొట్లు పెట్టాలని చెబుతున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు పండితులు. అలాగే మీరు ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీతో పాటుగా ఒక పసుపు కొమ్మును పెట్టుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే పసుపు కొమ్ముకు కార్యసిద్ధిని కలిగింపజేసే శక్తి ఉంటుందట. కాబట్టి మీతో పాటుగా పసుపు కొమ్మును తీసుకొని వెళ్ళినప్పుడు మీరు వెళ్లిన పనిలో విజయం లభిస్తుందని చెబుతున్నారు.
Spirtuality: మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా సరిగా జరగడం లేదా.. అయితే మీతో పాటు ఇవి ఉండాల్సిందే?

Spirtuality