Site icon HashtagU Telugu

Shani Dev: శనిదేవుడికి పూజలు చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?

Shani Pradosh Vrat 2024

Shani Pradosh Vrat 2024

శనీశ్వరుడు.. చాలామంది హిందువులు ఈ పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుని పూజించడం వల్ల ఆయన ఆలయాలకు వెళ్లడం వల్ల కష్టాలు వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శనీశ్వరుని పూజించని వారితో పోల్చుకుంటే పూజించే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా చాలామంది ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయాలకు వెళ్లి స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే శనీశ్వరుని పూజించడం మంచిదే కానీ స్వామి వారిని పూజించేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదు.

మరి శనీశ్వరున్ని పూజించేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే శని దేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలు పాటించాలి. లేకుంటే శని భగవానుడి ఆగ్రహానికి గురవుతారు. శనీశ్వరుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా శనికి ఎదురుగా నిలబడి మొక్కుకోవడం నేరుగా శనీశ్వరుడి కళ్ళ లోకి చూడడం లాంటివి చేయకూడదు. శని ఆలయానికి వెళ్ళినప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన పాదాల వైపు మాత్రమే చూడాలి. శని కళ్లలోకి చూస్తూ, పూజించడం ద్వారా, శని భగవానుడి దృష్టి నేరుగా మీపై పడుతుంది. ఆలయం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎప్పుడూ కూడా శనీశ్వరుడికి మీ వెన్నును చూపకూడదు. శనీశ్వరుని పూజించిన తర్వాత వీపు చూపిస్తే శనీశ్వరుని ఆగ్రహానికి గురి కావచ్చు.

అలాగే శనీశ్వరుని పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. నీలం లేదంటే నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ఈ రంగులు శని దేవుడికి ఇష్టమైన రంగులు. శని దేవుడికి నూనె సరఫరా చేయబోతున్నట్లయితే, రాగి పాత్రలను ఉపయోగించకూడదు. ఎల్లప్పుడూ కేవలం ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే శనిశ్వరుడికి పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపుకు తిరిగి పూజలు చేయకూడదు. శని దేవుడు పశ్చిమానికి అధిపతి కాబట్టి మీరు శనిశ్వరున్ని పూజించేటప్పుడు మీ ముఖం పడమర వైపుగా ఉండాలి.

Exit mobile version