Site icon HashtagU Telugu

Lakshmi Devi: దీపావళికి లక్ష్మీదేవి విగ్రహాన్ని కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

Lakshmi Devi

Lakshmi Devi

హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. ఈ దీపావళి పండుగను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంటి నిండా దీపాలను అలంకరించి క్రాకర్స్ పేలుస్తూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ కోసం ఏడాది పొడవునా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీపావళికి చాలా రోజుల ముందు లక్ష్మీ దేవిని స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. దీపావళికి ముందు వచ్చే ధంతేరస్‌ కోసం లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసే సంప్రదాయం కూడా శతాబ్దాల నాటి నుంచి వస్తోంది.

అయితే ఈ రోజున కొనుగోలు చేసిన లక్ష్మీ, గణేశుడి విగ్రహాన్ని దీపావళి రోజున ఆచారాల ప్రకారం పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఈ విగ్రహాలను కొనుగోలు చేసేటప్పుడు చాలాసార్లు చేసే పొరపాట్లు సరైన ఫలితాలను పొందలేవట. లక్ష్మి, గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని చెబుతున్నారు. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని విగ్రహాలు కొనుగోలు చేసి ప్రతి ష్టించుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పేదరికం తొలగిపోతుందని చెబుతున్నారు. అయితే దీపావళి ఆరాధన కోసం ఎల్లప్పుడూ ఎలుక పై స్వారీ చేసే వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయాలనీ చెబుతున్నారు.

అలాగే ఎడమ వైపు తొండం ఉండే విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అతను చేతిలో మోదకం పట్టుకుని ఉన్నది కొనుగోలు చేయడం మంచిదట. అటువంటి వినాయకుని విగ్రహాన్ని కొనుగోలు చేయడం ద్వారా సాధకులు విశేష ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు. ఇకపోతే ఎలాంటి లక్ష్మీదేవి విగ్రహం కొనుగోలు చేయాలి అన్న విషయానికి వస్తే.. దీపావళి నాడు కమలంపై కూర్చున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఎల్లప్పుడూ కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. అలాంటి విగ్రహం కుటుంబానికి శుభప్రదంగా పరిగణిస్తారట. దీపావళి రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు లక్ష్మీదేవి గుడ్లగూబపై ఎక్కకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలట. నిల్చున్న భంగిమలో ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. లక్ష్మీ దేవి నిలువెత్తు విగ్రహం ఆమె నిష్క్రమణకు చిహ్నంగా భావిస్తారు. దీపావళి ఆరాధన కోసం ఎల్లప్పుడూ లక్ష్మీ, వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేయాలట.

ఈ విగ్రహాలు ఒకదాని పక్కన ఒకటి ఉంచాలని చెబుతున్నారు. ధంతేరాస్ రోజున లక్ష్మీ, గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. ఈ విగ్రహాలు రంగు మారకుండా లేదా అస్పష్టంగా ఉండకూడదని, పగిలినవి, రంగు పోయినవి కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. విగ్రహం ఎల్లప్పుడూ సంతోషకరమైన భంగిమలో ఉండాలట. ఇది మీ ఇంటి ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని చెబుతున్నారు. లక్ష్మీ, గణేష్ విగ్రహం రంగు ఎరుపు, గులాబీ లేదా పసుపు రంగులో ఉండాలట. విగ్రహాన్ని నలుపు, గోధుమ లేదా లేత గోధుమరంగు రంగులో ఉన్నవి పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదని, అలాంటివి అశుభ ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు.