Site icon HashtagU Telugu

Lakshmi Devi: ఇంట్లోని దరిద్రం తొలిగిపోవాలంటే పూజ గదిలో ఈ 2 విగ్రహాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. అవేంటంటే!

Lakshmi Devi

Lakshmi Devi

మామూలుగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం చాలామంది దేవుళ్ళ మీద భారం వేస్తూ రకరకాల పూజలు పరిహారాలు దాన ధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు కొన్ని రకాల వాస్తు చిట్కాలను ఉపయోగించడం వల్ల కూడా మనం ఎదుర్కొనే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడి, ఇబ్బందులు ఉండకూడదు అనుకున్న వారు ఇంట్లోనే పూజా మందిరంలో లక్ష్మీదేవి కుబేరుడు విగ్రహాలను తప్పకుండా పెట్టుకోవాలని, ఈ విగ్రహాలను పెట్టుకొని పూజిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి, కుబేరుడు విగ్రహాలు పూజ గదిలో ఉండడం మంచిదట. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు ఇంట్లో పూజ గదిలో ఉండడం వలన ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చట. సంతోషాన్ని కూడా పొందవచ్చని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు విగ్రహాలు ఇంట్లో ఉంటే డబ్బుకి కొరత ఉండదట.

పేదరికం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. కాగా వాస్తు ప్రకారం కుబేరుడు, సంపదనిచ్చే లక్ష్మీ ఆశీర్వాదంతో పేదరికాన్ని తొలగించుకోవచ్చు. ఇంట్లో ఎక్కడ చూసినా శ్రేయస్సు ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆదాయం కూడా పెరుగుతుంది. డబ్బుకి సంబంధించిన ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చట. అయితే ఈ విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని పూజించడం మాత్రమే కాదు ఎల్లప్పుడూ పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు. ఎక్కడ అయితే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవికి తీసుకుని కూర్చుంటుందట. ముఖ్యంగా పూజ స్థలం చుట్టూ మురికి లేకుండా చూసుకోవాలని, లక్ష్మీదేవి మురికిని ద్వేషిస్తుందని చెబుతున్నారు.