మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి వస్తూపోతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి అంటే కొన్ని రకాల పరిహారాలను పాటించాలి అని చెబుతున్నారు. గవ్వలను ఉపయోగించి కూడా కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం మీరు మీరు నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఐదు గవ్వలను తీసుకువచ్చి వాటిని ఇంట్లో పూజ గదిలోని లక్ష్మీదేవి వద్ద ఉంచాలి.
లక్ష్మీదేవిని పూజించాలి. అలా పూజించిన తర్వాత ఆ గవ్వలను శుభ్రం చేసి ఏదైనా ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మీరు డబ్బులు దాచుకునే దగ్గర ఈ గవ్వలు ఉంచిన వస్త్రాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు పండితులు. సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. అలాగే గుప్పెడు గవ్వలు తీసుకొని వాటిని మీ ఇంట్లోనే లాకర్ లో డబ్బులు బంగారం పెట్టుకునే ప్రదేశంలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల డబ్బు కొరత ఉండదట. సంపద పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఖర్చులు తగ్గాలి సంపాదన పెరగాలి అనుకునేవాళ్ళు ప్రతిరోజు క్యారీ చేసే పర్సులో లేదా బ్యాగులో గవ్వలను ఉంచుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుందట. అది కూడా లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేసి ఆ తర్వాత పర్సులో పెట్టుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.
అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇంటర్వ్యూ కు వెళ్తున్న వారు బయటికి వెళ్లే సమయంలో గవ్వలని తీసుకొని వెళ్తే సరిపోతుందట. దేవుడి దగ్గర పూజ కోసం ఉంచిన గవ్వలు తీసుకునే దానిని పర్సులో పెట్టుకుని ఇంటర్వ్యూ కు వెళ్లడం వల్ల అంతా మంచే జరుగుతుందని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మీరు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లయితే ఇంటికి ఫౌండేషన్ వేసే సమయంలో గవ్వలను కూడా వేయాలట. ఎలా పడితే అలా కాకుండా ముందుగా ఆ గవ్వలను లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఇంటి పునాదిరాళ్ల వద్ద వేయాలని, ఇలా చేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయని చెబుతున్నారు.