కాశీ విశ్వనాథుడు (Kashi Vishwanath) ధరించే అక్బరీ తలపాగాను గత 5 తరాలుగా ఓ ముస్లిం కుటుంబం తయారు చేస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు. ఇది నిజం.. కాశీకి చెందిన ఘియాసుద్దీన్ కుటుంబం ప్రతి సంవత్సరం హోలీకి ముందు రంగభరి ఏకాదశి సందర్భంగా కాశీ విశ్వనాథుడికి తలపాగా సిద్ధం చేసి ఇస్తోంది. సంప్రదాయం ప్రకారం.. రంగభరీ ఏకాదశి రోజున ప్రత్యేక అలంకరణలో కాశీ విశ్వనాథుడు, తల్లి పార్వతీ భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకలో కాశీ విశ్వనాథుడు (Kashi Vishwanath) ఘియాసుద్దీన్ కుటుంబం తయారు చేసిన తలపాగాను ధరిస్తారు.
ఘియాసుద్దీన్ కుటుంబం తలపాగాలు చేస్తుంది. సూది మరియు దారంతో ఈ తలపాగాను తయారు చేస్తారు. తన చేతులు పనిచేస్తున్నంత కాలం, కళ్లు బాగున్నంత కాలం కాశీ విశ్వనాథ్‌కి సేవ చేస్తూనే ఉంటానని ఘియాసుద్దీన్ అంటున్నారు. రాయల్ లుక్ తో ఉండే ఈ తలపాగా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే తయారు చేయబడుతుంది. 250 ఏళ్లుగా ఘియాసుద్దీన్ కుటుంబం ఈ తలపాగాలు తయారు చేస్తోంది. వారణాసిలోని సిగ్రా ఏరియా లల్లాపురలోని తన ఇంటిలో ఘియాసుద్దీన్ తలపాగాలు తయారు చేస్తున్నారు. లక్నో నుండి వలస వచ్చి కాశీలో స్థిరపడిన తన పూర్వీకుల నుండి ఈ నైపుణ్యాన్ని నేర్చుకున్నానని ఘియాసుద్దీన్ చెప్పారు. తలపాగా తయారు చేసినందుకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా ప్రసాదంగా భావించి ఘియాసుద్దీన్ ఫ్యామిలీ తీసుకుంటుంది.బాబా విశ్వనాథుని సేవ కోసం ఏడాది పొడవునా వేచి ఉంటానని ఆయన చెప్పారు. ఈ తలపాగాను పట్టు వస్త్రం, జరీ, గోటా, కార్డ్‌బోర్డ్‌తో తయారు చేస్తారని తెలిపారు. ఇది సిద్ధం చేయడానికి ఒక వారం రోజులు పడుతుందన్నారు. తలపాగాను నగినా, ముత్యాలు, కాళంగి, వెల్వెట్, పట్టు మరియు గోటాతో అలంకరిస్తామని చెప్పారు. అయితే
ఈ తలపాగాను కాశీ విశ్వనాథుడికి అలంకరించే పనిని కూడా అరోరా కుటుంబం ఐదు తరాలుగా చేస్తోంది. ఐదవ తరానికి చెందిన నంద్‌లాల్ అరోరా ఈ తలపాగాను అలంకరించిన ఐదో తరం.
Also Read: Holashtak: ఈ రోజు నుంచే హోలాష్టక్.. రాబోయే 8 రోజులు ఏం చేయకూడదంటే..