Site icon HashtagU Telugu

‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

Karthika Masam

Karthika Masam

Karthika Masam: హిందువులు ఒక ఆర్థిక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో చేసే పూజలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయి. కాగా కార్తీక మాసంలో విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు శాలిగ్రామం రూపంలో ఉన్న తులసి దేవిని వివాహం చేసుకున్నాడు. ఈ మాసంలో దీపదానం, యజ్ఞం, యాగం, గంగాస్నానం, దానధర్మాలు, వివాహాలు, గృహప్రవేశాలు వంటివి చాలా ఫలితాలను అందిస్తాయి. ఇకపోతే శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారైతే, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాసం అంతా తులసి మొక్కను పూజించాలట.

‎ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించాలని,తులసి చాలీసాను చదవాలని చెబుతున్నారు. అలాగే కార్తీక మాసంలో సాయంత్రం పూట మీ ఇంట్లోని పూజ చేసే చోట కర్పూరాన్ని వెలిగిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. ఇంట్లోని సభ్యుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రావని చెబుతున్నారు. అంతే కాదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం, సాయంత్రం పూజ చేస్తే మరింత ఫలప్రదం అవుతుందట. అలాగే కార్తీక మాసంలో అష్ట లక్ష్మిని పూజించాలట.

‎దీనితో మీకు ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సంతానం, ఆరోగ్యం,  సంతోషం, శాంతి కూడా లభిస్తాయని, ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించాలట. కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మి వ్రతం కూడా ఆచరించవచ్చట. అష్టలక్ష్మిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవు అని చెబుతున్నారు పండితులు. ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించుకోవడం కోసం కార్తీక మాసంలో ప్రతిరోజూ గంగాస్నానం చేయాలట. అయితే నది దగ్గరగా లేనివారు రోజూ స్నానం చేసే నీటిలో కొంత గంగాజలం కలుపుకోవచ్చని, ముందుగా నువ్వుల నూనెను శరీరానికి అప్లై చేసుకుని స్నానం చేయాలని ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. వాస్తవానికి ఈ మాసంలో ముల్లంగి తినడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందట. ఆహారంలో ముల్లంగిని కూడా చేర్చుకోవచ్చు. అంతే కాకుండా కార్తీక మాసంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా తినాలట. ఈ నెలలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, మద్యం మొదలైన వాటిని తినకూడదని చెబుతున్నారు.

Exit mobile version