Site icon HashtagU Telugu

Karthika Masam: కార్తీక సోమవారం నాడు వీటిలో ఏ ఒక్క పని చేసినా చాలు.. పరమేశ్వరుడి అనుగ్రహం కలగడం ఖాయం?

Karthika Masam

Karthika Masam

ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఎక్కడ చూసినా కూడా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. కార్తీకదీపాలతో వెలిగిపోతున్నాయి. కార్తీకమాసం పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువులకు ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్పాలి. ఇకపోతే ఈ మాసంలో పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు తప్పకుండా ఆర్థిక సోమవారాలలో ప్రత్యేకమైన నియమాలను పాటించాలని చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కార్తిక సోమవారం నాడు ఈ 6 పనుల్లో ఏ ఒక్కటి చేసినా కూడా పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందట.

కార్తీకసోమవారం ఉపవాసం ఉండి రోజంతా శివ నామస్మరణ చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే పరమశివుడి అనుగ్రహం పొందడమే కాకుండా విశేషమైన శుభ ఫలితాలు కూడా కలుగుతాయట. వండిన ఆహారాన్ని స్వీకరించకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇక నెక్ట్​ డే ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం స్వీకరించాలని చెబుతున్నారు.

అలాగే పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కావాలి అనుకున్న వారు ఏకభుక్తం అంటే ఉదయం శివ పూజ చేసిన తర్వాత ఆహారాన్ని స్వీకరించవచ్చు. కానీ సాయంత్రం మళ్ళీ శివ పూజ శివ అభిషేకం చేసిన తర్వాత రాత్రి అన్నం తినకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలట. ఇక మరుసటి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు ఆహారం తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.

అలాగే కార్తీక సోమవారం ఉదయం పూట శివ పూజ, శివాభిషేకం చేశాక భోజనం చేయవద్దు. మళ్లీ, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తం అంటారు. అన్నింటిలో కంటే ఈ ఒక్కటి పాటించినా శివుడి అనుగ్రహానికి ఈజీగా పాత్రులు కావచ్చు అని చెబుతున్నారు.

అలాగే ఈ మాసంలో సోమవారం ఈ నియమం పాటించినా మంచి ఫలితం ఉంటుందట. అదే అయాచిత. మీరు ఆహారం తినడానికి ప్రయత్నించకుండా ఎవరు ఏది ఇస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించాలని చెబుతున్నారు. అదేవిధంగా కార్తీక సోమవారం మీరు ఏ పూజలు చేయకపోయినా తెల్లవారు జామున చన్నీటి స్నానం చేసినా చాలట. ఆ శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.