Karthika Masam: దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో చేసేటువంటి పూజలు, దారధర్మాలు, నదీ స్నానాలు, దీప దానాలు ప్రత్యేక ఫలితాలను కలిగిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం అని చెబుతున్నారు. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారికి అశ్వమేథ యాగం చేసిన ఫలితం కలుగుతుందట. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉందని చెబుతున్నారు.
ఈ ఏడాది కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అని చెబుతున్నారు. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదట. రేపు చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను అందిస్తాయని చెబుతున్నారు. కాగా కార్తీకమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నెల రోజులు పూజ చేసినా ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తిశ్రద్దలతో శివయ్యను పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శివయ్యకు పూజ చేసి అనంతరం ఉపవాస దీక్ష విరమిస్తారు.
అయితే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని చెబుతున్నారు. అయితే ఈ ఉపవాసం రోజు ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. తర్వాత సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాయలయాని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలట. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలట. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలని, ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
Karthika Masam: కార్తీకమాసం సోమవారం చేసే స్నానం, ఉపవాసం, దీప దానం ఎలాంటి ఫలితాలను అందిస్తాయో మీకు తెలుసా?

Karthika Masam