Site icon HashtagU Telugu

Karthika Masam : కార్తీక దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారో తెలుసా?

Karthika Masam Karthika Deepam Importance

Karthika Masam Karthika Deepam Importance

కార్తీక మాసం(Karthika Masam)లో వేకువ జామునే లేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి కాలువలు, చెరువులు వంటి చోట వదిలిపెడతారు. అయితే మన సృష్టికి మూలం ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం అదే విధంగా మన సృష్టిలో “శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు” అంటారు. ఆ శివుడికి దీపారాధన చేసి కార్తీక దీపాలను నీటిలో వదిలిపెడతాము. అయితే దీనిలో ఎంతో పరమార్ధం ఉంది.

జీవకోటి జీవించడానికి పంచభూతాలు అనగా నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి ఎంతో ముఖ్యం. శివం పంచభూతాత్మకం అని తెలిసినపుడే దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతామో అన్న విషయం తెలుస్తుందని పండితులు చెబుతున్నారు. మనం నీటిలో దీపాలను వదిలిపెడతాము నీరు, నిప్పు రెండు విభిన్నమైనవి. కానీ ఈ కార్తీకమాసంలో వాటిని కలిసి చూస్తాము.

ఆత్మ జ్యోతి స్వరూపం అంటారు. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది. అయితే ఆత్మ జ్యోతి రూపంలో మారి శివునిలో ఐక్యం అవుతుందని అంటారు. అదే మరణం అంటే మన శరీరం నుండి ఆత్మ జ్యోతి రూపంలో వెళితే శివుని సన్నిధి చేరినట్లే. కనుక ఆ భావంతో మన లోని ఆత్మను శివునికి సమర్పించినట్లుగా దీపాలను నీటిలో వదులుతాము. ఈ విధంగా కార్తీక దీపాలను వెలిగించడం వలన శివునికి దగ్గర అవుతాము. శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో శివ దీపారాధన చేయడం, శివుడిని గరిక, జాజి, అవిసె పువ్వు, బిల్వ దళాలు, జిల్లేడు పూలతో పూజిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని పురాణాలలో తెలిపారు.

Also Read : Karthika Masam : కార్తీకమాసంకి ఇంకొక పేరు కౌముది మాసం.. ఎందుకో మీకు తెలుసా?