కార్తీక మాసం(Karthika Masam 2023) ఈ నెల 14 వ తేదీ నుండి ప్రారంభమైంది. కార్తీకమాసం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే పూజలు, సేవా కార్యక్రమాలు ఎంతో మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతారు. ఈ కార్తీక మాసం నెల రోజులు ఉదయాన్నే లేచి చన్నీటితో స్నానం చేసుకొని ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శివుడిని ప్రార్ధిస్తే మంచిదని చెబుతారు. ఎలాశ్రీ మొదటి కార్తీక సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. ఈ కార్తీక మాసం నెల రోజులు కార్తీక స్నానాలు చేయలేని వారు కనీసం కార్తీక సోమవారాలు చేసినా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతారు.
ఈ కార్తీక మాసం నెల రోజులు రోజుకొక కధ పురాణం చొప్పున కార్తీక పారాయణం మొత్తం చదివితే మంచి ఫలితం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో పంచారామాలు దర్శించుకోవడం లేదా సముద్ర స్నానం చేయడం కూడా మంచిది. ఈ నెల రోజులు రోజూ సాయంత్రం లేదా ఉదయం లేదా రెండు సార్లు దీపారాధన చేయడం మంచిది. ఇలా నువ్వులనూనెతో దీపారాధన చేయడం వలన మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఏ ఇంటిలో అయితే ఈ నెల రోజులు నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇల్లు సిరిసంపదలతో నిండి ఉంటుంది అని నమ్మకం.
ఈ కార్తీకమాసం మొత్తం శాఖాహారమే తినాలి. ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వాడకూడదు. మద్యం, మాంసం వంటివి ముట్టుకోకూడదు. ఈ విధంగా కార్తీకమాసం మొత్తం శివుని ఆరాధన చేస్తూ శాఖాహారం తినడం వలన మన ఆరోగ్యానికి, మనసుకు ఎంతో మంచిది. ఎవరైతే కార్తీకమాసాన్ని నిష్ఠతో పాటిస్తారో వారి దుఃఖాలను శివుడు తప్పక తీరుస్తారని నమ్ముతారు.
Also Read : Kartika Masam : నేటి నుంచి కార్తీకమాసం.. ఈ మాసంలో తులసి పూజ విశిష్టత ఇదీ