Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం చేయడం వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో దీపాలను దానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా కూడా భావిస్తారు. దీనివల్ల పాపాలు తొలగిపోయి, కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
కాగా ఈ మాసంలో చేసే దీపదానం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తి లభించి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకం. ఈ దీప దానం వల్ల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ దీపదానం చేస్తారు. ఇది ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుందట. అదేవిధంగా దీపదానం వల్ల శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. ప్రతీకూల శక్తులు తొలగిపోయి, ఇంట్లో సానుకూల శక్తులు ప్రవహిస్తాయట. ప్రతి పనిలో కూడా అనుకూలత లభించి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతున్నారు. అలాగే దీపదానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని చెబుతున్నారు.
కాగా గోధుమ పిండిలో బెల్లం, ఆవు పాలు కలిపి పిండి దీపాన్ని తయారు చేయాలట. స్వయంగా పత్తిని వత్తులుగా తయారు చేయాలని, పిండి దీపంలో వత్తులు ఉంచి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వెలిగించాలని చెబుతున్నారు. ఇలా వెలిగించిన దీపాన్ని ఆలయాల్లో లేదా అవసరమైన వారికి దానం చేయాలట. కార్తీక మాసంలో ఎప్పుడైనా దీప దానం చేయవచ్చట. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో చేస్తే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. సూర్యోదయ సమయంలో లేదా సూర్యా స్తమయం తర్వాత సాయంత్రం వేళల్లో దీప దానం చేయవచ్చని, దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Karthika Masam 2025: కార్తీకమాసంలో దీప దానం ఎందుకు చేస్తారు.. దాని ప్రముఖ్యత ఏంటో తెలుసా?

Karthika Masam 2025