Usiri Deepam: కార్తీక మాసంలో చేసేటటువంటి దానాలలో దీపదానం కూడా ఒకటి. మామూలు దీపాలతో పాటుగా ఉసిరి దీపాలను కూడా పండితులకు దానంగా ఇస్తూ ఉంటారు. అయితే ఉసిరి దీపం దానం చేయడం మంచిదే కానీ కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ముఖ్యంగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఉసిరి దీపం దానం విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇతర మాసాల్లో కంటే కార్తీక మాసంలో చేసిన పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు అధికమైన లాభాలు ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అందుకే చాలా మంది కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు శివస్వరూపంగా అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. ఈ మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగించడం, లేదా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని, సమస్త దరిద్రాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.
కార్తీకంలో దీపారాధన చేసేటప్పుడు స్టీల్ లేదా రాగి పాత్రలో బియ్యం తీసుకొవాలి. దాని మీద ఉసిరికాయ పెట్టి, దీపం వత్తి దాని మీద పెట్టి, పసుపు, కుంకుమ పెట్టాలి. తోచినంత సంభావన దాని మీద పెట్టి దీపం వెలిగించి పండితుడిని కార్తీక దామోదరుడి స్వరూపంగా భావించి దీపదానం ఇవ్వాలి. ఇటీవల కొంత మంది ఉసిరిని మామిడి కాయ ఆకు లేదా ఇతర ఆకుల మీద పెట్టి ఉసిరికి కనీసం పసుపు,కుంకుమ కూడా అద్దకుండా దీపదానం ఇస్తున్నారు. ఉసిరి కూడా చెడిపోయింది లేదా రంధ్రాలు ఉన్నది దానంగా ఇవ్వకూడదట. కాబట్టి దీపారాధన చేసే క్రమంలో ఈ నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. పండితులకు దానంగా ఇచ్చేవి ఏదో నామ మాత్రంగా కాకుండా మంచి మనసుతో, మనం ఏవిధంగా ఇంట్లో తెచ్చుకుంటామో అలాంటివి దానంగా ఇవ్వాలట. దానం ఎలా చేస్తే అలాంటి ప్రతిఫలం మనకు లభిస్తుందని చెబుతున్నారు.
Usiri Deepam: కార్తీక మాసంలో ఉసిరి దీపం దానం చేస్తున్నారా.. ఈ పొరపాట్లు తప్పులు అస్సలు చేయకండి?

Usiri Deepam