కార్తీకమాసంలో చాలామంది కార్తీక స్నానాలు చేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. పరమేశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు. కాగా ఈ నెలల్లో నదీ స్నానాలు, పూజలు, ఉపవాసాలు ఎక్కువగా చేస్తారు. ఈ నెలలో చేసే ప్రతి పూజ ఈశ్వరుడికి నేరుగా చేరుతుందని భావిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా కార్తీకమాసంలో ఉపవాసం ఉంటే కొన్ని అంశాలపై దృష్టి సారించాలట. అయితే ఈ మాసంలో ఉపవాసం ఉండాలి అనుకునేవారు మొదట ఆరోగ్య పరిస్థితులను గురించి ఆలోచించి వైద్యుల సలహా తీసుకొని ఆ తరువాత ఉపవాసం చేయడం మంచిదని చెబుతున్నారు.
ప్రస్తుతం చలికాలం కావడంతో ఈ సమయంలో శరీరంలో ఎక్కువ మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి వేళ మీరు ఉపవాసం ఉండొచ్చో లేదో వైద్యులను అడిగి తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉంటే కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలట. మీ లైఫ్ స్టైల్‌కి, హెల్త్‌కి ఇబ్బంది కలిగించని ఉపవాసం చేయాలని చెప్తున్నారు. మధుమేహం ఉన్నవారు తరచూ రక్తంలో షుగర్ లెవల్స్ ని చెక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేయకపోవడమే మంచిదట. గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఉపవాసానికి దూరంగా ఉండాలట. కళ్లు తిరిగినా, నీరసంగా అనిపించినా,ఉపవాసానికి బ్రేక్ ఇచ్చి ఏమైనా ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు.
కొందరు ఉపవాసమున్నప్పుడు పచ్చి మంచి నీరు కూడా తాగను అంటూ ఉంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు కచ్చితంగా హైడ్రేటెడ్‌గా ఉండాలి అంటున్నారు నిపుణులు. లేదంటే డీహైడ్రేట్ అయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కొందరు ఉపవాసం ఉన్నప్పుడు ఆఫీస్ లకు వెళ్తారు. అలాంటివారు ఫ్రూట్ జ్యూస్ లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కళ్లు తిరిగి పడిపోయే అవకాశముందని చెప్తున్నారు. ఉపవాస సమయంలో శరీరాన్ని కష్టపెట్టే పనులు చేయకపోవడమే మంచిదని చెప్తున్నారు. లేదంటే శరీరం త్వరగా బలహీనపడిపోతూ ఉంటుంది. యాక్టివ్‌గా ఉండలేరు. లేదంటే మీ వర్క్, మీ హెల్త్‌కి తగ్గట్లు ఫాస్టింగ్ని ఎంచుకోవాలి.
మీరు హెల్తీగా ఉంటే.. మీరు రోజంతా ఫాస్టింగ్ చేవచ్చు. లేదంటే కొత్తగా ఉపవాసం ఉంటే మీరు ఒక పూట భోజనం చేసేలా చూసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో ఉపవాసముండాలనుకుంటే.. తెల్లారుజామునే లేవాలి. బ్రహ్మమూర్తాన లేచి తలస్నానం చేయాలి. శివయ్యను లేదా విష్ణువుకు పూజ చేసుకుని రోజును ప్రారంభించాలి. ఉపవాసముంటే సరి. ఈ సమయంలో కొందరు అస్సలు నాన్‌వెజ్ అస్సలు తినరు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా ఉపయోగించరు. లైట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. పాలు, నెయ్యి, ఫ్రూట్స్, నట్స్‌ను ఎక్కువగా వినియోగిస్తారు.