Karthika Masam 2025: కార్తీక మాసం అనగానే అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి కార్తీకదీపాలు, వనభోజనాలు, ఉసిరి దీపాలు. అయితే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉసిరి చెట్టు కింద భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద కూర్చుని భోజనాలు చేయటం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తోంది. హిందు పండుగలకు ఆరోగ్య రహస్యాలకు నిలయం అనే విషయం ప్రతీ పండుగలోను కనిపిస్తుంది.
కార్తీక మాసంలో పూజలు,స్నానాలు, దీపాలు, ఉసిరి చెట్టుకింద భోజనాలు వంటి సంప్రదాయంగా మార్చారని చెప్పాలి. ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని చెబుతారు. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్దాప్యాన్ని దరిచేరనివ్వవని నిపుణులు చెబుతారు. అద్భుతమైన ఔషదాల గని ఉసిరి. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రీ వృక్షమని అంటారు. ఉసిరి ఆరోగ్యానికి సంజీవిని లాంటిదని చెప్పాలి. శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు అని చెప్పాలి.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఈ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట. ఈ చెట్టుకింద భోజనాలు చేసే ముందు ఉసిరిచెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరి ఆలతో పూజించాలట. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలు అంటూ మొత్తం ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తరవాత చెట్టు నీడలో భోజనాలు చేయాలట. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మ దేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మలో సకల దేవతలు ఉంటారని చెబుతుంటారు. కార్తీకమాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగించటం అత్యంత శుభకరంగా భావిస్తారట. ఈ దీపం కార్తీక దామోదరుడు అనగా శ్రీ మహా విష్ణువుడు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోవడంతో పాటు దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయట. నరదిష్టి ఆ ఇంటికి తగలదని చెబుతున్నారు.
Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం ఎందుకు చేస్తారు మీకు తెలుసా?

Karthika Masam 2025