Karthika Masam 2023 : ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజులు.. తేదీలతో సహా పూర్తి సమాచారం..

ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు ఉంది.

Published By: HashtagU Telugu Desk
Karthika Masam 2023 Full Details with All Days

Karthika Masam 2023 Full Details with All Days

కార్తీకమాసం(Karthika Masam 2023) రాగానే ఎక్కువగా అందరికీ గుర్తుకు వచ్చేది కార్తీక నోములు, కార్తీక మాసంలో చేసుకునే వనభోజనాలు, కార్తీక పౌర్ణమి నాడు మనం వెలిగించుకునే జ్యోతులు, గుడిలో జరిపే జ్వాలాతోరణం, గుడిలో నిర్వహించే దీపోత్సవం. ఇలా ఈ మాసం అంత భక్తి భావంలో ఉంటుంది. ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు ఉంది.

ఈ సంవత్సరం నవంబర్ 27 మరియు 26 రెండు రోజులు కార్తీక పౌర్ణమి ఉంది. కానీ 26 సాయంత్రం నుండి 27 మధ్యాహ్నం వరకే పౌర్ణమి ఘడియలు ఉన్నవి కావున నవంబర్ 26న కార్తీక పౌర్ణమి జరుపుతారు. ఆ రోజునే శ్రీశైలంలో కృష్ణవేణి నదీమ తల్లికి పుణ్యనదీ హారతి కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం జ్వాలాతోరణం కూడా నిర్వహిస్తారు.

కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే విదియ తిధి నాడు అనగా నిన్న నవంబర్ 15న భగినీహస్త భోజనం చేసుకున్నారు. కార్తీకమాసంలో వచ్చే చవితి నాడు నాగుల చవితి గా జరుపుకుంటారు. ఈ నెల 17 న నాగుల చవితి వచ్చింది కావున ఆ రోజున పుట్టలో పాలు పోసి నాగ దేవతను ఆరాధిస్తారు.

ఈ సారి కార్తీక మాసంలో మొదటి సోమవారం నవంబర్ 20 వ తేదీన వచ్చింది. ఇంకా ఈ సారి నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అవి నవంబర్ 20, నవంబర్ 27, డిసెంబర్ 4 మరియు డిసెంబర్ 11. నవంబర్ 26 న కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించుకునే వారు వెలిగించుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతీ రోజు వత్తులు వెలిగించుకోలేక పోయిన రోజుకొక వత్తి చొప్పున 365 రోజులకు 365 వత్తులు వెలిగిస్తాము. అయితే ఈ వత్తులు కార్తీక పౌర్ణమి నాడు లేదా కార్తీక సోమవారం నాడు అయిన వెలిగించుకోవచ్చు. డిసెంబర్ 13న పోలి సర్గం జరుపుకోవాలి. పోలి సర్గం అంటే అరటి డొప్పల్లో వత్తులు వెలిగించి కాలువలో వదిలిపెడతారు. అంతటితో కార్తీకమాసం పూర్తవుతుంది. ఈ విధంగా కార్తీకమాసంలో విశేషమైన రోజులు జరుపుకుంటారు.

 

Also Read : Karthika Masam: కార్తీకమాసంలో స్నానమాచరించే విధానాలు..!

  Last Updated: 16 Nov 2023, 08:18 AM IST