Site icon HashtagU Telugu

Karthika Amavsaya 2024: కార్తీకమాసం అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ దశ తిరగడం ఖాయం!

Karthika Amavsaya 2024

Karthika Amavsaya 2024

మామూలుగా మనకు ప్రతి నెల పౌర్ణమి అమావాస్య తిదులు వస్తూ ఉంటాయి. అయితే ప్రతీ నెల కాకుండా కొన్ని ప్రత్యేకమైన మసాలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు. అమావాస్య ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది. అమావాస్య రోజున గంగా స్నానం, శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. అలాగే లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం. అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పితృ దోషం తొలగిపోతుందని నమ్మకం.ఇకపోతే ఏడాది కార్తీక మాసం అమావాస్య డిసెంబర్ 1వ తేదీన వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుందట. అమావాస్య తిధి నవంబర్ 30, శనివారం ఉదయం 10:29 నుంచి ప్రారంభమవుతుంది.

అదే సమయంలో ఈ అమావాస్య తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాన్ని చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అలాగే మీ ఖజానా డబ్బుతో నిండిపోతుందట. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి 108 నామాలను జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ నామాలు ఏంటి అన్న విషయానికి వస్తే…

లక్ష్మిదేవి అష్టోత్తర శతనామావలీ.. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యాయై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై ది నమః, ఓం దీపాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ద్యై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకాశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః,ఓం పద్మ సుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రామాయై నమః, ఓం పద్మమాలాధారాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః,ఓం పద్మగంధిన్యై నమః,ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇన్దుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్టాయై నమః, ఓం శివాయై నమః, ఓం శివకార్య నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ఠాయై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాన్తాయై నమః, ఓం శుక్లమాల్యామ్బరాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయై నమః,ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకార్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రీసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నృపవేశ్యగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రకారాయై నమః, ఓం సముద్రతనాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళా దేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణసమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః,ఓం మహాకాళ్యై నమః,ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం మంగళదేవ్యై నమః,ఓం భువనేశ్వరాయై నమః అనే నామాలను పటించడం వల్ల తప్పకుండా లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందట..