Vastu-Tips : ప్రతిరోజూ కర్పూరం వెలిగిస్తే…ఏం జరుగుతుందో తెలుసా..?

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ దీపాల, ధూపం, కర్పూరంతో దేవుడిని పూజించడం ఆనవాయితీ.

  • Written By:
  • Publish Date - June 7, 2022 / 07:00 AM IST

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజూ దీపాల, ధూపం, కర్పూరంతో దేవుడిని పూజించడం ఆనవాయితీ. శుభకార్యాల్లో కూడా ఇలా చేస్తుంటారు. ఎందుకంటే ఇలా చేస్తే పర్యావరణం శుభ్రపడుతుందని , సానుకూల శక్తి చుట్టుమడుతుందని నమ్ముతుంటారు. అలాగే వాస్తు రీత్యా ప్రతిరోజూ ఇంట్లో కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే…ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు, శాంతి ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాదు ఒక రూపాయికి దొరికే కర్పూరాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే..జీవితంలో కూడా పెను మార్పులు చూడవచ్చు. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఇంట్లో కర్పూరం పెట్టుకుంటే కలిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు దోషం తొలగుతుంది.
ఇంటి వాస్తుదోషం తొలగిపోవాలంటే…ఇంట్లో మూలల్లో కర్పూరం పెట్టాలి. దీంతో ఇంటి వాస్తు దోషాలు తొలిగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ఇంటిని చుట్టుముడుతుంది. కర్పూరం కరిగితే..వాస్తు దోషం తొలగిపోతుందని అర్ధం చేసుకోవాలి. కావాలనుకుంటే…మీ ఇంట్లో మూలలో కర్పూరాన్ని వెలిగించి చూడండి.

ఒత్తిడి దూరం అవుతుంది.
ఇంట్లో ధూపం లేదా కర్పూరం వెలిగించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదోక విధంగా ధూప దీపం లేదా కర్పూరం నుంచి వెలువడే సువాసన ఇల్లు అంతటా వ్యాప్తిస్తుంది. ఇది మనస్సును సంతోషంగా, ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపాలు, కర్పూరం వెలిగించి పూజించండి.

ఇంట్లో తగాదాలు తగ్గుతాయి..
ఇంట్లో కర్పూరం వెలిగిస్తే…సానూకూల శక్తి వ్యాపించడం ప్రారంభం అవుతుంది. ఇది జీవితంలోపురోగతి, విజయానికి మార్గంగా నిలుస్తుంది. ఇది కుటుంబంలో విభేదాలను తగ్గించడంతోపాటు ఆనందం, శాంతి, శ్రేయస్సుు పొడిగిస్తుంది.

దాంపత్య జీవితం…
కర్పూరాన్ని వెండి కానీ ఇత్తడి గిన్నెలో ప్రతిరోజూ వెలిగించాలి. కర్పూరంతో మీరు బెడ్ రూంను శుభ్రం చేసినట్లయితే…వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.

ఆర్థిక పరిస్థితులు బలంగా…
ఇంట్లో ప్రతిరోజూ మూడు కర్పూరంను కాల్చండి. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. జీవితంలో ఆహారం, డబ్బు సమస్యలను కూడా తొలగిస్తుంది.

శాస్త్రీయ కారణాలు ఇంట్లో కర్పూరం, ధూపదీపం పెట్టడం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అంటే కర్పూరం, అగరబత్తులు ఇంట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. తద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇల్లు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.